దుబ్బాక రెడీ త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా

0
27
dubhaka elections ,coming soon ghmc also

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్- అధికార పార్టీ శాసన సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి హఠాత్మరణంతో దుబ్బాక ఉన్న ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు దుబ్బాకలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం దుబ్బాక ఉప ఎన్నికల తేదీలను విడుదల చేసింది. అక్టోబర్ 9 న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు  నవంబర్ 3 న పోలింగ్ నిర్వహించనున్నట్లు  నవంబర్ 10 న ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంటే నవంబర్ 10 కల్లా దుబ్బాక ఎన్నికల పని పూర్తి అవుతుంది కాబట్టి డిసెంబర్ నుండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది కానీ అంతకంటే ముందే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది కూడా. గ్రేటర్ ఎన్నికల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను గురించి ఇప్పుడే కసరత్తు ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ పార్టీ అత్యధికంగా 99 స్థానాలను దక్కించుకొని చరిత్ర సృష్టించింది. బల్దియా చరిత్రలోనే ఇంతటి సంచలన విజయం అందుకున్న పార్టీ లేదు.

ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేయాలంటే గులాబీ పార్టీకి సరైన అభ్యర్థులే లేకుండవాళ్ళు. ఒకసారి పోటీ చేస్తే కేవలం ఒక్క కార్పొరేటర్ మాత్రమే గెలిచాడు టిఆర్ఎస్ పార్టీ తరుపున కట్ చేస్తే కాలం మారింది , రాష్ట్రం సిద్దించింది ఇప్పుడు గులాబీ పార్టీ ఛాంపియన్ గా అవతరించింది. అయితే ఈసారి కేసీఆర్ పార్టీకి గ్రేటర్ లో విజయం నల్లేరు మీద నడక కాకపోవచ్చు ఎందుకంటే ఒకవైపు భారతీయ జనతా పార్టీ తో పాటుగా కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. దానికి తోడు గతకొంత కాలంగా కేసీఆర్ సర్కారుపై గ్రేటర్ వాసులు ఆగ్రహంగా ఉన్నారు మరి. మొత్తానికి 2021 కొత్త సంవత్సరంలో గ్రేటర్ సింహాసనంని అధిష్టించేది ఎవరో తేలనుంది. 

మునుపటి వ్యాసంప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రభాస్ డైరెక్టర్
తదుపరి ఆర్టికల్అనసూయ లేటెస్ట్ ఫొటోస్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి