డాక్టర్ రాజశేఖర్ పెద్ద కూతురు హీరోయిన్ గా

0
24

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ పెద్ద కూతురు శివాని హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇంతకుముందు శివాని హీరోయిన్ గా అనుకున్న సినిమాలు కొన్ని షూటింగ్ కొంత భాగం మాత్రమే జరిగి విడుదల కాకుండా ఆగిపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం వెన్నెల గా ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. హీరోల కొడుకులు హీరోలుగా నటించడం చాలా కామన్ కానీ టాలీవుడ్ లో మాత్రం అలా కాదు. హీరోల కూతుర్లు కూడా హీరోయిన్ గా నటించడానికి సిద్ధపడతారు అని మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ నిరూపించింది. ఇక అదే వారసత్వాన్ని కొనసాగించడానికి సిద్ధం అవుతోంది శివాని.

డాక్టర్ రాజశేఖర్ కు కొడుకులు లేరు ఉన్నది ఇద్దరు కుమార్తలే . శివాత్మిక ఆల్రెడీ దొరసాని చిత్రంలో హీరోయిన్ గా నటించింది. తన ప్రతిభ నిరూపించుకుంది. ఇక శివాని పలు చిత్రాల్లో నటించడానికి ఒప్పుకుంది కానీ ఆ సినిమాలు పూర్తి కాలేదు. దాంతో కొంత నిరుత్సాహపడింది కూడా. కట్ చేస్తే ఇన్నాళ్ల విరామం తర్వాత మంచి ఛాన్స్ లభించినట్లుంది. వెన్నెలగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈరోజు జులై 1 శివాని పుట్టినరోజు దాంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది టాలీవుడ్ మూవీ న్యూస్.

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి