సన్ ఆఫ్ ఇండియాగా మోహన్ బాబు

0
42
manchu mohan babu

TMN -Hyderabad- కలెక్షన్ కింగ్ గా పేరు గాంచిన మంచు మోహన్ బాబు తాజాగా సన్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటించడానికి అంగీకరించారు. మరో విశేషం ఏంటంటే డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం. బుర్రకథ చిత్రంతో దర్శకుడు అయ్యాడు రచయిత డైమండ్ రత్నబాబు. అయితే ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ మోహన్ బాబు రత్నంకు ఛాన్స్ ఇచ్చాడంటే గొప్ప విషయమే. డైమండ్ రత్నం చెప్పిన కథ మోహన్ బాబుకు నచ్చడంతో ఏమాత్రం ఆలోచించకుండా అతడికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారట. దాంతో ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి సన్ ఆఫ్ ఇండియా పోస్టర్ ని విడుదల చేశారు.

మోహన్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక మిగిలిన తారాగణం ఏంటి అన్నది త్వరలోనే చెబుతారట. ఇంకో విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని మోహన్ బాబు – మంచు విష్ణు సంయుక్తంగా నిర్మిస్తుండటం. భారత రాజకీయాలపై ఎక్కుపెట్టిన అస్త్రం ఈ సన్ ఆఫ్ ఇండియా చిత్రం అని తెలుస్తోంది. మోహన్ బాబు చాలా కాలంగా సినిమాల్లో నటించడం లేదు. ఆమధ్య నటించిన కొన్ని చిత్రాలు పరాజయం పొందడంతో కొంత గ్యాప్ తీసుకున్నారు. ఇక మళ్ళీ నటించాలని చాలా కథలు విన్నాడట. అయితే అన్ని కథల్లో కెల్లా డైమండ్ రత్నబాబు చెప్పిన కథ మోహన్ బాబుకు బాగా నచ్చిందట.

మునుపటి వ్యాసంఇంద్రప్రస్థం మోషన్ పోస్టర్ తో అంచనాలు పెంచాడు
తదుపరి ఆర్టికల్అప్సరా రాణి అందాల విందు థ్రిల్లర్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి