ఆ హీరో అభిమానుల డిమాండ్ కి ఒప్పుకుంటాడా ?

0
35
surya tamil hero

టాలీవుడ్ మూవీ న్యూస్,చెన్నై 23 సంవత్సరాలుగా సినిమాల్లో నటించింది చాలు ఇక రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా పరిపాలన అందించు అంటూ తమిళ స్టార్ హీరో సూర్య అభిమానులు అతడ్ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు తమిళనాడు వ్యాప్తంగా పలు చోట్ల చేగువేరా గెటప్ లో ఉన్న సూర్య ఫోటోలను అలాగే తమిళనాడు సెక్రటేరియట్ ని ముద్రించి పోస్టర్ లు వేశారు దాంతో రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగింది. ఇప్పటికే తమిళనాట హీరో విజయ్ కాంత్ ఒక రాజకీయ పార్టీ పెట్టి ఫెయిల్ అవగా కమల్ హాసన్ కూడా తాజాగా రాజకీయ పార్టీ పెట్టాడు.

ఇది చాలదన్నట్లు రజనీకాంత్ కూడా త్వరలోనే తన రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు ప్రకటించనున్నాడట. అంతేనా తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి స్టార్ డం ఉన్న మాస్ హీరో విజయ్ కూడా రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక విజయ్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున తమిళనాట పోస్టర్ లు వేశారు రాజకీయాల్లోకి రావాలని. ఇక ఇప్పుడేమో సూర్య అభిమానులు తమ అభిమాన హీరో రాజకీయాల్లోకి రావాలని ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

తమిళనాట జయలలిత , కరుణానిధి చనిపోయిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు. తమిళనాట అన్నా డీఎంకే , డీఎంకే పార్టీలు మాత్రమే రొటేషన్ పద్దతిలో అన్నట్లుగా అధికారం చేపట్టాయి ఇన్నాళ్లు. అయితే ఈసారి రాజకీయ ఉద్దండులైన జయలలిత , కరుణానిధి లేకపోవడంతో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. దాంతో పలువురు స్టార్ హీరోలు రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. రజనీకాంత్ , విజయ్ , సూర్య అభిమానులు తమ హీరోలను రాజకీయాల్లోకి రావాలని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అయితే ఉన్నది ఒక్కటే ముఖ్యమంత్రి పదవి. మరి ఈ ముగ్గురు హీరోలలో రాజకీయాల్లోకి వచ్చేది ఎవరు ? ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు ? ఎవరు అభిమానుల డిమాండ్ కు తలొగ్గుతారు అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. 

మునుపటి వ్యాసంలారెన్స్ సంచలన ప్రకటన
తదుపరి ఆర్టికల్నాని వి చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూసిన జక్కన్న
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి