ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ల చిత్రానికి బడ్జెట్ ఎంతో తెలుసా

0
34
jr ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందనున్న విషయం తెలిసిందే. కాగా ఆ చిత్రానికి ఏకంగా 200 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ అంటే భారీ యాక్షన్  సీక్వెన్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఆ యాక్షన్ సీక్వెన్స్ కోసమే ఎక్కువ బడ్జెట్ కేటాయించనున్నారట. ఇది ఇప్పటి బడ్జెట్ సుమా ….. ఆర్ ఆర్ ఆర్ చిత్రం విడుదల అయ్యాక భారీ హిట్ కొట్టాక ఎన్టీఆర్ రేంజ్ మారిపోతుంది కాబట్టి , అందుకు తగ్గట్లుగా ఈ బడ్జెట్ ని మరింతగా పెంచడం ఖాయమని తెలుస్తోంది. అంటే ఇప్పుడు అనుకుంటున్న 200 కోట్లకు అదనంగా మరో 100 కోట్లు పెరిగినా ఆశ్చర్యం లేదు. కాకపోతే అది ఆర్ ఆర్ ఆర్ రిజల్ట్ ని బట్టి ఉంటుంది.

ఆర్ ఆర్ ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10 భాషలలో విడుదల కానుంది. రాజమౌళి బ్రాండ్ ఉంది కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ వస్తాయి అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే సినిమా బాగుంటే బాక్సాఫీస్ బద్దలు అవుతుంది. బాగోలేకపోతే యావరేజ్ గా నిలుస్తుంది. అందుకే ఆర్ ఆర్ ఆర్ ఫలితాన్ని బట్టి ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ ల సినిమా బడ్జెట్ పెరగడమా లేక తగ్గించడమా అన్నది తేలనుంది. ఆర్ ఆర్ ఆర్ ఎలాగూ హిట్ అవుతుందని బడ్జెట్ కూడా పెరగడం ఖాయమని భావిస్తున్నారు. ఎన్టీఆర్ మాస్ హీరో అలాంటి హీరోకు మాస్ డైరెక్టర్ ఆయిన ప్రశాంత్ నీల్ దొరికితే ఇక కొత్తగా చెప్పాలా ? బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. ఇప్పటికే ఎన్టీఆర్ కు కథ చెప్పాడట ప్రశాంత్ నీల్. దాంతో ఎన్టీఆర్ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారని అంటున్నారు.

మునుపటి వ్యాసంసూపర్ స్టార్ రజనీకాంత్ నటుడిగా 45 ఏళ్ళు
తదుపరి ఆర్టికల్దుబ్బాక నుండి పోటీ చేయనున్న మాజీ ఎంపీ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి