సమంత ఎందుకు ఏడ్చిందో తెలుసా

0
35
samanth akkineni

హీరోయిన్ సమంతకు కోట్ల కొద్దీ ఆస్థి ఉంది కాబట్టి కష్టాలు ఉండవు , కన్నీళ్లు రావు అని అనుకుంటారు కొంతమంది జనాలు కానీ ఆమె కూడా ఓ సాధారణ మహిళే కాబట్టి కష్టాలు , కన్నీళ్లు కామన్ అందుకు తాజాగా జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. ఇటీవల సమంత బాగా ఏడ్చిందట. పైగా ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. అయితే సమంత ఇంతగా ఏడవడానికి కారణం ఏంటో తెలుసా…… తన వాళ్లకు రాషెస్ వచ్చాయట. దాంతో విపరీతంగా ఏడ్చిందట. సమంత ఏడవడం వల్ల ఆ రాషెస్ తగ్గవు అని తెలిసినప్పటికీ ఏడుపు మాత్రం ఆపలేదట. అయితే కొద్దిసేపటి తర్వాత తేరుకొని తనని తాను తమాయించుకుందట. అయితే రాషెస్ ఎవరికి వచ్చాయి అన్నది మాత్రం రివీల్ చేయలేదు సమంత.

ఇటీవల సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించిన సమంత ఈ విషయాన్ని చెప్పి ఆశ్చర్యపరిచింది. అలాగే లాక్ డౌన్ సమయంలో క్యారెట్ లను పండించానని , ఎక్కువగా తిన్నది కూడా క్యారెట్ లనే అంటూ సెలవిచ్చింది సమంత. క్యారెట్ లను పండించారు కాబట్టి వ్యవసాయం మీద దృష్టి పెట్టండి అని ఒకరు ఉచిత సలహా ఇవ్వగా తప్పకుండా నాకు ఇప్పటి వరకు అలాంటి ఆలోచన రాలేదు తప్పకుండా దానిపై దృష్టి పెడతాను అని తెలిపింది సమంత. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది సమంత. దాంతో ఎప్పటికప్పుడు తన ఆలోచనలు ప్రేక్షకులతో పంచుకుంటోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే …… ఓ బేబీ వంటి విభిన్న కథా చిత్రంలో నటించి సోలోగా బ్లాక్ బస్టర్ అందుకున్న సమంత ఆ తర్వాత జాను అనే రీమేక్ చిత్రంలో నటించింది. సమంత , శర్వానంద్ ల నటనకు మంచి పేరు వచ్చినప్పటికీ సినిమా మాత్రం హిట్ కాలేదు దాంతో తప్పు 96 రీమేక్ లో నటించి తప్పు చేశానా ? ఫీల్ అయ్యిందట. అసలు 96 రీమేక్ చేయాలని అనుకున్నప్పుడే రీమేక్ చేయొద్దు ఆ ఫీల్ పోతుందని ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది సమంత. అయితే ఆ రీమేక్ సినిమాలో సమంత నటించాల్సి వచ్చింది. ఇక ఇప్పుడేమో తెలుగులో ఎలాంటి చిత్రాన్ని అంగీకరించలేదు కానీ తమిళంలో అలాగే ఓ వెబ్ సిరీస్ లో మాత్రం నటిస్తోంది సమంత.

మునుపటి వ్యాసంశర్వానంద్ పెళ్లి చేసుకోబోయేది ఎవరినో తెలుసా
తదుపరి ఆర్టికల్టాలీవుడ్ హీరోలు – వాళ్ళ రెమ్యునరేషన్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి