జర్నలిస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రోజా ఎందుకో తెలుసా

0
58
mla roja

జర్నలిస్ట్ అడిగిన ఓ ప్రశ్న నగరి శాసన సభ్యురాలు రోజా కు విపరీతమైన కోపం తెప్పించింది దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అతడిపై. ఇంతకీ ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా……. ఒక ఎం ఎల్ ఏ అయి ఉండి జబర్దస్త్ స్టేజ్ పై ఆ డ్యాన్స్ లు ఏంటి? మీరు వేసుకుంటున్న బట్టలు ఏంటి ? అని ప్రశ్నించడమే. అంతే రోజా కు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో ఆ జర్నలిస్ట్ పై మండిపడింది. అంతేనా …… చిరంజీవి , బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లు డ్యాన్స్ లు చేస్తే తప్పు లేదు కానీ నేను చేస్తే తప్పా అంటూ విరుచుకుపడింది రోజా.

నేను మొదట నటిని ఆ తర్వాత రాజకీయ నాయకురాలిని. ఈ విషయం ప్రజలకు, మా నాయకుడు జగన్ కు తెలుసు వాళ్లకు లేని అభ్యంతరం మీకు ఎందుకు? అని ప్రశ్నించింది. చిరంజీవి కేంద్ర మంత్రి గా పనిచేశాడు మళ్లీ కెమెరా ముందు డ్యాన్స్ లు చేయడం లేదా ? బాలయ్య బాబు హిందూపురం ఎమ్మెల్యే గా ఉన్నాడు ఆయన సినిమాల్లో డ్యాన్స్ లు చేయడం లేదా ? పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు గా ఉన్నాడు అయినా సినిమాల్లో డ్యాన్స్ లు చేయడం లేదా ? అంతెందుకు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఒకవైపు ముఖ్యమంత్రి గా పనిచేస్తూనే సినిమాల్లో నటించాడు వాళ్లకు లేని అభ్యంతరం నాకు మాత్రం ఎందుకు? మగవాళ్ళు చేస్తే తప్పు లేదు కానీ ఆడవాళ్లు చేస్తే తప్పా ? అంటూ పాపం ఆ జర్నలిస్ట్ పై విరుచుకుపడింది దాంతో సైలెంట్ అయ్యాడు ఆ జర్నలిస్ట్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి