ప్రభాస్ ని ఎందుకు ఎంపిక చేసారో తెలుసా

0
35

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏంటి ? రాముడి పాత్రలో నప్పుతాడా ? ఇది సరైన ఎంపిక కాదంటూ అదేపనిగా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అయితే మొదట్లో ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు దర్శకుడు ఓం రౌత్. కానీ ఇటీవల ఇంకా ఎక్కువగా విమర్శలు రావడంతో ఎట్టకేలకు స్పందించాడు ఓం రౌత్. ప్రభాస్ ఏంటి ? రాముడిగా నటించడం ఏంటి ? అని అంటున్నారు కానీ ప్రభాస్ ని ఎందుకు ఎంపిక చేసామో తెలుసా ……. శ్రీరాముడిగా ప్రభాస్ ని మించి మరెవరినీ ఊహించుకోలేకపోయాను అంతేకాదు ప్రభాస్ కళ్ళు తీక్షణంగా చూస్తుంటాయి అందుకే ప్రభాస్ నా పర్ఫెక్ట్ రాముడు అని వస్తున్న విమర్శలను , అనుమానాలను పటాపంచలు చేసాడు ఓం రౌత్.

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ప్రశంసలతో పాటుగా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రభాస్ శ్రీరాముడిగా మెప్పిస్తాడా ? అనే అనుమానం నెలకొంది చాలామందిలో. అయితే అలాంటి వాళ్ళ అనుమానాలను పట్టించుకోవడం లేదు దర్శకుడు ఓం రౌత్. ప్రభాస్ ని శ్రీరాముడిగా ఎలా చూపిస్తానో చూసి చెప్పండి అంటూ సవాల్ కూడా విసురుతున్నాడు ఈ దర్శకుడు.

ప్రభాస్ శ్రీరాముడిగా నటించడం అంటే తప్పకుండా తన రేంజ్ ని మరింతగా పెంచుకోవడం ఖాయమనే చెప్పాలి. భారతీయులకు శ్రీరాముడు అంటే ఎంతో పవిత్రమైన దేవుడు, ఆదర్శప్రాయుడు . దాంతో తప్పకుండా బాహుబలిని మించిన ఇమేజ్ ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రావణాసురుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ప్రభాస్ విలువిద్యలో శిక్షణ పొందుతున్నాడు తాజాగా. 

మునుపటి వ్యాసంఓటీటీ ని కూడా చంపేస్తారా ?
తదుపరి ఆర్టికల్ఈషా చావాలా న్యూ ఫోటో షూట్ ఫొటోస్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి