ప్రభాస్ విలన్ ఎవరో తెలుసా

0
62

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడుగా నటిస్తున్న విషయం తెలిసిందే దాంతో మరి రావణుడు ఎవరు ? అన్న చర్చ సాగింది. అయితే ఈ చర్చ ఎక్కువ కాలం కొనసాగకుండా తక్కువ సమయంలోనే తెరదించాడు దర్శకుడు ఓం రౌత్. ఇక ప్రభాస్ పాలిట ఈ సినిమాలో విలన్ ఎవరో తెలుసా…….. ఇంకెవరు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్.

అవును బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ని రావణాసురుడు గా ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు ప్రభాస్. సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ హీరో అయితే గతకొంత కాలంగా వరుస పరాజయలతో సతమతం అవుతున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో దర్శకుడు ఓం రౌత్ తన దర్శకత్వంలో తెరకెక్కిన తనాజీ చిత్రంలో సైఫ్ అలీఖాన్ ని  విలన్ గా చూపించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. తానాజీ గా అజయ్ దేవ్ గన్ నటించాడు. అయినప్పటికీ సైఫ్ అలీఖాన్ విలనిజానికి మంచి పేరొచ్చింది. ఇక రావణుడు అంటే హీరోతో సమానమైన పాత్ర కావడంతో సైఫ్ అంగీకరించాడట.

500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ఆది పురుష్ 2021 ఆఖరున సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం చేస్తున్నాడు. ఆ సినిమా లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. దాని తర్వాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నాడు ప్రభాస్. ఆ సినిమా కంప్లీట్ చేసి ఆది పురుష్ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం విలువిద్యలో శిక్షణ పొందుతున్నాడు ప్రభాస్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి