నమ్రతకు ఏ హీరో అంటే ఇష్టమో తెలుసా

0
21

మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ కు ఏ హీరో అంటే ఇష్టమో తెలుసా…… ఇంకెవరు మహేష్ బాబు అంటేనే ఇష్టమట. వంశీ చిత్రంలో మహేష్ బాబు – నమ్రత జంటగా నటించారు. తొలిచూపులోనే ఇద్దరికి మంచి అభిప్రాయం కుదిరింది. దాంతో సినిమా కంప్లీట్ అయ్యేలోపు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడంతో ప్రేమలో పడిపోయారు. ఇక షూటింగ్ కంప్లీట్ అయి వెళ్లిపోతున్నాం అనే సమయానికి ప్రాణం పోయినంత పని అయ్యిందట. దాంతో మహేష్ ని విడిచి ఉండలేననే విషయం బాగా అర్ధమయ్యింది నమ్రతకు. అలాగే మహేష్ బాబుకు కూడా నమ్రత అంటే అంతే ఆసక్తి ఏర్పడింది. అందుకే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

దాంతో నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పింది అంతేకాదు భవిష్యత్ లో మళ్లీ సినిమాల్లో నటించడం కష్టమే అని తేల్చిచెప్పింది. నిన్న సోషల్ మీడియాలో నెటిజన్ల ముందుకు వచ్చిన నమ్రత పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అందులో భాగంగానే మహేష్ బాబు నా అభిమాన హీరో అని స్పష్టం చేసింది. మహేష్ బాబు భార్యగా అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ సూపర్ స్టార్ వైఫ్ అనిపించుకుంటోంది. మహేష్ బాబు కు పెద్దమొత్తంలో వస్తున్న డబ్బులను ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతూ తెలివితేటలు ప్రదర్శిస్తోంది.

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి