బిత్తిరి సత్తి ఏ ఛానల్ లో జాయిన్ అయ్యాడో తెలుసా

0
38

తెలంగాణ యాసలో , తన పదాల కనికట్టుతో యావత్ తెలుగు ప్రజలను తన అభిమానులుగా మలుచుకున్న వ్యక్తి బిత్తిరి సత్తి. మొదట వి6 ఛానల్ లో తనదైన మార్క్ కామెడీతో అలరించిన బిత్తిరి సత్తి ఆ తర్వాత ఆ ఛానల్ కు స్వస్తి పలికి ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ రావడంతో టీవీ 9 లోకి వెళ్ళాడు. అక్కడ ఎక్కువ రోజులు పనిచేయకుండానే  ఆ ఛానల్ కు గుడ్ బై చెప్పాడు. ఇంకేముంది ఇప్పుడు ఏకంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఛానల్ అయిన సాక్షి లో ప్రత్యక్షం అయ్యాడు. సాక్షి ఛానల్ వాళ్ళు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పడంతో జాయిన్ అయ్యాడట బిత్తిరి సత్తి.

ఇంతకుముందు లాగే తనదైన యాసలో భాషలో కార్యక్రమం చేయనున్నాడు బిత్తిరి సత్తి. ఈ కార్యక్రమం ద్వారా సాక్షి ఛానల్ కు మరింత ప్రయోజనం చేకూరడం ఖాయం. బిత్తిరి సత్తి తమ ఛానల్ లోకి అడుగుపెట్టడంతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు సాక్షి బృందం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి తెలంగాణ యాసతో బాగానే కీర్తి ప్రతిష్టలు పొందాడు బిత్తిరి సత్తి.

మునుపటి వ్యాసంటీఆర్పీ రేటింగ్ అదరగొట్టిన మహేష్ బాబు
తదుపరి ఆర్టికల్ప్రభాస్ న్యూ మూవీ ఫస్ట్ లుక్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి