మహేష్ ఇంట్లో లేకపోతే ఎక్కడ ఉంటాడో తెలుసా?

0
54
mahesh babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ ఉంటే షూటింగ్ లకు వెళ్తాడు లేదంటే ఖాళీ దొరికితే తన కుటుంబంతో కలిసి ఫారిన్ టూర్ లకు వెళ్తుంటాడు. అయితే ఇప్పుడు కరోనా వల్ల షూటింగ్ లు లేకపోవడంతో గత 5 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఎప్పుడూ ఇంట్లో ఉండాలంటే బోర్ అయినా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది కాబట్టి గత అయిదు నెలలుగా ఇంట్లోనే ఉంటూ ఇతర కార్యక్రమాలపైన దృష్టి పెట్టాడు. ఈ ఖాళీ సమయంలోమహేష్ బాబు ఉంటే ఇంట్లో ఉంటాడు లేకపోతే ఎక్కడ ఉంటాడో తెలుసా …….. తన సొంత జిమ్ లో.

అవును కరోనా వల్ల ఎక్కువ సమయం ఖాళీ దొరకడంతో పిల్లలతో ఆడుకుంటూ , స్విమ్ చేస్తూ సేద తీరుతున్న మహేష్ ఎక్కువ శాతం జిమ్ లో గడుపుతున్నాడు. ట్రెడ్ మిల్ పై రన్ చేస్తూ తన ఫిట్ నెస్ ని మరింతగా పెంచుకుంటున్నాడు. మహేష్ బాబు ట్రెడ్ మిల్ పై నడుస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది మహేష్ భార్య నమ్రత. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది నమ్రతా శిరోద్కర్. ఎప్పటికప్పుడు తన విషయాలతో పాటుగా మహేష్ బాబు ఫోటోలను , వీడియోలను అలాగే తన ఇద్దరు పిల్లలు గౌతమ్ , సితార లకు సంబందించిన విషయాలను తన ఇన్ స్టా గ్రామ్ లో వెల్లడిస్తూనే ఉంటోంది నమ్రత.

మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట చిత్రంలో నటించనున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో పాత్రలో అనన్య పాండే కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అభిమానులను అలరించేలా ట్రీట్ ఇచ్చారు సర్కారు వారి పాట యూనిట్.

మునుపటి వ్యాసంప్రభాస్ పెద్దనాన్న కోరిక తీరుస్తాడా ?
తదుపరి ఆర్టికల్ప్రభాస్ ఆది పురుష్ లో సూర్పనఖ  పాత్ర కావాలట ఈ భామకు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి