అల్లు అర్జున్ కోసం ఏ ఐటమ్ భామ వస్తోందో తెలుసా?

0
30

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు , తమిళ , హిందీ , కన్నడ , మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందనుంది. కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న అల్లు అర్జున్ సరసన నటించనున్న ఈ చిత్రంలో స్పెషల్ ఎట్రాక్షన్ ఐటెం సాంగ్. సుకుమార్ చిత్రాలు అంటేనే స్పెషల్ ఐటెం సాంగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలను పరిశీలిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రంలో కూడా మాస్ ని అలరించే ఐటెం సాంగ్ ప్లాన్ చేసాడు సుకుమార్. ఇంతకీ ఈ ఐటెం సాంగ్ లో నటించే హాట్ భామ ఎవరో తెలుసా…… ఊర్వశి రౌతేలా.

తన అందాలతో కుర్రాళ్ళ గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తున్న హాట్ భామ ఊర్వశి రౌతేలా. ఒంటి మీద బట్టలు వేసుకోవాలంటే పరమ చిరాకు ఈ భామకు దాంతో ఉల్లిపొర లాంటి వస్త్రాలు అలాగే ఉండీ లేనట్లుగా ఉండే వస్త్రాలను తన అస్త్రాలుగా మలుచుకొని కుర్రాళ్ళని హీటెక్కిస్తోంది. అందుకే ఈ భామని ఐటెం భామగా సెలెక్ట్ చేశాడట దర్శకుడు సుకుమార్. అలాగే విలన్ గా సంజయ్ దత్ కానీ సునీల్ శెట్టి ని కానీ అనుకుంటున్నాడట. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు సెట్ అయినా సినిమాకు మరింత హెల్ప్ అవుతుందని భావిస్తున్నాడట సుకుమార్.  

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి