నితిన్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా

0
35
nithin new movie check

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్యంగ్ హీరో నితిన్ తాజాగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా పేరు చదరంగం అని వినబడింది. అయితే తాజాగా ఈ చిత్ర టైటిల్ ని రివీల్ చేసారు దర్శకుడు కొరటాల శివ. ఇంతకీ నితిన్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా …….. ” చెక్ ”. అవును నితిన్ – చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి ” చెక్ ” అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఇక ఈ టైటిల్ ని విడుదల చేసింది అగ్రశ్రేణి దర్శకులు కొరటాల శివ. కొద్దిసేపటి క్రితం ఈ టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు.

భీష్మ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నితిన్ రంగ్ దే అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక రంగ్ దే తర్వాత ఈ చెక్ పట్టాలెక్కనుంది. విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా చంద్రశేఖర్ ఏలేటి కి మంచి పేరుంది. ఈ దర్శకుడు మంచి చిత్రాలే చేసాడు కానీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు పాపం ఎందుకంటే మంచి చిత్రాలు చేసినప్పటికీ అవి సాలిడ్ హిట్స్ కాలేకపోయాయి దాంతో ఈ దర్శకుడి ప్రతిభ వెలుగులోకి రాలేదు. అయినప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నాడు కమర్షియల్ హిట్ కోసం.

ఇక చెక్ టైటిల్ విషయానికి పోస్టర్ విషయానికి వస్తే …….. చేతులకు బేడీలు వేసుకొని ఉన్న నితిన్ చదరంగం ఆడుతూ చెక్ పెడుతున్నట్లుగా ప్రీ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రంలో అందాల భామలు రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. 

మునుపటి వ్యాసంసోనూ సూద్ కు హీరోగా అవకాశాలు
తదుపరి ఆర్టికల్కేసీఆర్ మనవడికి గాయాలు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి