సెప్టెంబర్ 2 ప్రత్యేకతలు ఏంటో తెలుసా

0
39
September 2 special
ఈరోజు సెప్టెంబర్ 2 . కాగా ఈరోజుకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా……. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , నందమూరి హరికృష్ణ, జీవితా రాజశేఖర్ ల పుట్టినరోజు. అయితే ఇదే రోజున మరో దుర్దినం కూడా జరిగింది అదే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం. చిత్రపరిశ్రమలోని పలువురు ప్రముఖుల పుట్టినరోజు సెప్టెంబర్ 2 కావడం , వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన రోజు కావడం కాకతాళీయమే.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ :

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పవన్ కల్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అండతో సినిమారంగంలో హీరోగా రంగప్రవేశం చేసాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం పవన్ కల్యాణ్ మొదటి సినిమా. ఆ తర్వాత గోకులంలో సీత చిత్రంతో కమర్షియల్ గా విజయాన్ని అందుకున్నాడు. ఇక తమ్ముడు , బద్రి , తొలిప్రేమ చిత్రాలతో యువతలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఖుషీ చిత్రంతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఆ చిత్రం తర్వాత ఎక్కడ చూసినా పవన్ కల్యాణ్ ఇమేజ్ ని టచ్ చేసేంత స్థాయి ఏ హీరో కూడా ఇప్పటి వరకు అందుకోలేకపోయాడు. ఖుషీ తర్వాత చాలా సంవత్సరాల పాటు పవన్ కల్యాణ్ నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి అయినా ఇమేజ్ విషయంలో మాత్రం చెక్కు చెదరలేదు సరికదా మరింతగా పెరుగుతూనే ఉంది.

నందమూరి హరికృష్ణ :

ఎన్టీఆర్ వారసత్వాన్ని మొదట్లో సినిమారంగంలో నిలబెట్టింది నందమూరి హరికృష్ణ. నటుడిగా బాలయ్య కంటే ముందే వచ్చాడు , అయితే ఆ తర్వాత బాలయ్య రాకతో హరికృష్ణ స్టూడియో వ్యవహారాలు చూస్తూ తెరవెనుక ఉండిపోయాడు. ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చాక రథసారథి గా చైతన్య రథాన్ని నడపడమే కాకుండా ఎన్టీఆర్ కు అన్ని రకాలుగా అండగా నిలిచాడు హరికృష్ణ. 1956 సెప్టెంబర్ 2 న జన్మించారు హరికృష్ణ. అయితే దురదృష్టవశాత్తు కారు డ్రైవ్ చేస్తూ నార్కట్ పల్లి సమీపంలో ఆగస్ట్ 29 న మరణించారు.

జీవిత రాజశేఖర్ :

1966  సెప్టెంబర్ 2 న జన్మించిన జీవిత హీరోయిన్ గా తెలుగు , తమిళ చిత్రాల్లో నటించింది. ఎక్కువగా డాక్టర్ రాజశేఖర్ కు జంటగా నటించింది జీవిత. దాంతో మొదట్లో రాజశేఖర్ కు జీవితకు అంతగా సఖ్యత లేకున్నా మెల్లి మెల్లిగా ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఆ తర్వాత ఆ స్నేహమే ప్రేమగా మారింది. రాజశేఖర్ కు యాక్సిడెంట్ కావడంతో అన్నీ దగ్గరుండి చూసుకుంది దాంతో రాజశేఖర్ – జీవితల పెళ్లికి పచ్చజెండా ఊపారు రాజశేఖర్ తల్లిదండ్రులు. పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన జీవిత మెగా ఫోన్ పట్టి డైరెక్టర్ కూడా అయ్యారు.

ఇక వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విషయానికి వస్తే……
1949 జులై 8 న జన్మించిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల పులిబిడ్డగా పేరు గాంచాడు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసినప్పటికి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి చాలాకాలమే పట్టింది. అసమ్మతి నేతగా ముద్రపడిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికలకు ముందు మండుటెండలో పాదయాత్ర చేసాడు. ఆరోగ్యం సహకరించకపోయినా వెన్ను చూపక ఎర్రటి ఎండలో కాలినడకన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా నడిచాడు. రాజశేఖర్ రెడ్డి కష్టాన్ని చూసిన ప్రజలు 2004 లో అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి 2009 లో మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే రచ్చబండ కార్యక్రమం కోసం సెప్టెంబర్ 2 న హైదరాబాద్ నుండి బయలుదేరిన వై ఎస్ పావురాల గుట్ట వద్ద అంతర్ధానమయ్యాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి