విడాకులు తీసుకున్న టాలీవుడ్ జంట

0
46
singer noel

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్టాలీవుడ్ లో మరో జంట విడాకులు తీసుకుంది. విడాకుల పర్వం ఎక్కువగా బాలీవుడ్ లో అలాగే కోలీవుడ్ లో మోలీవుడ్ లో జరుగుతుంటాయి. కానీ టాలీవుడ్ లో సైతం విడాకుల పర్వం కొనసాగుతోందని అడపా దడపా కొన్ని జంటలు నిరూపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆకోవలో హీరోయిన్ ఎస్తేర్ కూడా చేరింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 1000 అబద్ధాలు చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఎస్తేర్. ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు చిత్రం వచ్చింది. అయితే ఇది కూడా పెద్దగా ఆడలేదు దాంతో ఎస్తేర్ కు పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి.

సరిగ్గా ఇదే సమయంలో సింగర్ నోయల్ తో పరిచయం కావడం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో గత ఏడాది 2019 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన కొద్దిరోజులు బాగానే ఉన్నారట. కానీ వెంటనే ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి దాంతో కలిసి ముందుకు సాగలేం అని తెలుసుకొని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే కంటే విడిపోతేనే మంచిదని విడాకులకు అప్లయ్ చేశారట. అంటే పెళ్లి అయిన 6 నెలలకే విడాకులు కోరుకున్నారు. దాంతో ఇటీవలే ఎస్తేర్ – నోయల్ కు కోర్టు విడాకులు మంజూరు చేసింది. దాంతో ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది ఎస్తేర్.

మేము 5 నెలలు కూడా కలిసి ఉండలేదు. నేను నిజాయితీగా ఉంటాను అలాగే ఉండాలని ఎదుటి వాళ్ళను కోరుకుంటాను అందుకే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది ఎస్తేర్. ప్రస్తుతం మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టానని , ఇతర భాషల్లో నటిస్తున్నానని మంచి అవకాశాలు వస్తే మళ్లీ తెలుగులో నటించడానికి నేను సిద్ధమని అంటోంది ఎస్తేర్. నోయల్ తెలుగులో మంచి సింగర్ అన్న విషయం తెలిసిందే. నోయల్ సింగర్ మాత్రమే కాకుండా పలు చిత్రాల్లో కూడా నటించాడు. అయితే ఎస్తేర్ విడాకుల ప్రకటన చేసింది కానీ నోయల్ ఇంకా స్పందించలేదు.
మునుపటి వ్యాసంటాలీవుడ్ పై సంచలన ఆరోపణలు చేసిన హీరోయిన్
తదుపరి ఆర్టికల్ప్రభాస్ ఫ్యాన్స్ కు  మరో సినిమా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి