దిశ ఎన్ కౌంటర్ ట్రైలర్ విడుదల

0
40
disha encounter trailer

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్గత ఏడాది నవంబర్ లో దిశ అత్యాచారం , హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఆ సంఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం ” దిశ ఎన్ కౌంటర్ ”. ఈ చిత్ర ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితం దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో అధికారికంగా విడుదల చేసాడు. రెండు నిమిషాల నలభై నాలుగు సెకండ్లు ఉన్న ట్రైలర్ తో మరోసారి ఆనాటి సంఘటనలను గుర్తుకు తెచ్చాడు వర్మ. వెటర్నరీ డాక్టర్ అయిన దిశ టోల్ గేట్ పక్కనున్న రోడ్ లో తన స్కూటీ ని పార్క్ చేసిన సమయంలో చూసిన నలుగురు దుండగులు ఆమెని రేప్ చేయాలనే ప్లాన్ తో ఆ స్కూటీ ని పంక్చర్ చేస్తారు.

మద్యం మత్తులో ఉండి ఆమెని కిడ్నాప్ చేసి పక్కనే ఉన్న ప్రహరీ గోడ పక్కన దిశపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేయడమే కాకుండా ఆమెకు మద్యం తాగించి అనంతరం హత్య చేస్తారు. దిశ ఒంటిపై పెట్రోల్ పోసి తగులబెడతారు. సరిగ్గా ఇదే సమయంలో ఓ పోలీస్ పెట్రోలింగ్ వాహనం అక్కడి నుండి వెళ్లిపోతున్న సీన్ తో మరింత రక్తికట్టించారు వర్మ. గత ఏడాది జరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. కట్ చేస్తే దిశ ని హత్య చేసిన వాళ్ళని ఆమె పెద్ద కర్మ కాకుండానే ఎన్ కౌంటర్ లో లేపేయడం కూడా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇదే కథాంశంతో రూపొందిన దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు వర్మ. దిశ చనిపోయిన రోజునే అంటే నవంబర్ 26 నే ఈ దిశ చిత్రం విడుదల కానుంది. 2019 నవంబర్ 26 న దిశ హత్య జరుగగా 2020 నవంబర్ 26 న ఈ దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని ఓటీటీ లేదా ఏటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేయనున్నాడు వర్మ. దిశ ట్రైలర్ బాగానే ఉంది అయితే ట్రైలర్ మాత్రమే బాగుంటుందా ? సినిమా కూడానా ? అన్నది తెలియాలంటే నవంబర్ 26 వరకు ఎదురు చూడాల్సిందే. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి