ఓటీటీ ని కూడా చంపేస్తారా ?

0
41
ott plat forms

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్ –తాజాగా ఓటీటీలో విడుదల అవుతున్న చిత్రాలను చూస్తే త్వరలోనే ఓటీటీ కూడా శాటిలైట్ మాదిరిగానే చంపేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు శాటిలైట్ రైట్స్ సినిమాలకు ఉండేది కాదు కేవలం థియేట్రికల్ రైట్స్ మాత్రమే. కాకపోతే ఆ థియేటర్ లలో ”ఏ” సెంటర్ , ”బి ” సెంటర్ , ” సి ” సెంటర్ లు అనేవి ఉండేవి అంటే నగరాలు . పట్టణ ప్రాంతాలు , కాస్త పెద్ద గ్రామాలు. ఆయా ప్రాంతాల్లో అప్పట్లో సినిమా ఒకేసారి విడుదల అయ్యేది కాదు ముఖ్యంగా ఏ సెంటర్ లలో అలాగే కొన్ని బి సెంటర్ లలో విడుదల అయ్యేవి ఇక ఎప్పుడో కానీ సి సెంటర్ లో వచ్చేవి కావు. అయితే ఇలాంటి వాటి వల్ల నిర్మాతలకు అలాగే పంపిణీదారులు బాగానే డబ్బులు వచ్చేవి.

తర్వాత ఆ కాలం మెల్లిమెల్లిగా పోయి శాటిలైట్ బిజినెస్ రూపాంతరం చెందింది అంటే సినిమా హక్కులను ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ లలో ప్రసారం చేయడం అన్నమాట. 1995 తర్వాత తెలుగులో ఛానల్స్ ప్రారంభమయ్యాయి. దాంతో ఛానల్స్ పోటీపడి శాటిలైట్ రైట్స్ కొనడం మొదలు పెట్టాయి. అయితే బంగారు బాతు లాంటి శాటిలైట్ రైట్స్ ని కొంతమంది దర్శక నిర్మాతలు ఇష్టానుసారం వాడుకున్నారు దాంతో చెత్త , పరమచెత్త చిత్రాలు వచ్చాయి దాంతో శాటిలైట్ బిజినెస్ క్లోజ్ అయ్యింది.

ఇక ఇప్పుడు అలాంటి వాళ్లకు ఓటీటీ వరంలా మారింది కట్ చేస్తే గత కొంత కాలంగా వస్తున్న చిత్రాలన్నీ చూస్తే త్వరలోనే ఓటీటీ కూడా సాటిలైట్ రైట్స్ లా చంపేయడం ఖాయమని తెలుస్తోంది. ఓటీటీ యంగ్ టాలెంట్ కు ప్రోత్సాహకంగా ఉండాలి కానీ అడల్ట్ కంటెంట్ కు అండగా ఉంటోంది అని విమర్శలు వస్తున్నాయి. ఇదే సంప్రదాయం కొనసాగితే ఓటీటీ బిజినెస్ కూడా క్లోజ్ అవ్వడం ఖాయమని అప్పుడే విమర్శలు వస్తున్నాయి. 

మునుపటి వ్యాసంవెబ్ సిరీస్ లో నటిస్తున్న రేణు దేశాయ్
తదుపరి ఆర్టికల్ప్రభాస్ ని ఎందుకు ఎంపిక చేసారో తెలుసా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి