ఎం ఎల్ ఏ క్యాంప్ కార్యాలయం కూల్చివేత

0
44
trs party dubhaka

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్ఎం ఎల్ ఏ క్యాంప్ కార్యాలయం కూల్చివేయడం సంచలనం సృష్టిస్తోంది. అందునా అధికార పార్టీ ఎం ఎల్ ఏ క్యాంప్ కార్యాలయం కూల్చడంతో మరింత వైరల్ గా మారింది. ఈ సంచలన సంఘటన జరిగింది ఎక్కడో కాదు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో. వర్ధన్నపేట ఎం ఎల్ ఏ అయిన ఆరూరి రమేష్ అధికార టీఆర్ఎస్ పార్టీ సభ్యుడు అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ హన్మకొండలోని హంటర్ రోడ్ లో ఉన్న ఆరూరి రమేష్ క్యాంప్ కార్యాలయం కొంతభాగం నాలా పై ఆక్రమించి కట్టడంతో ఇటీవల భారీ వరదలకు లోతట్టు ప్రాంతాలు మరింతగా మునిగాయి దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఇక సోషల్ మీడియాలో అయితే వరంగల్ వరదలను ఎంతగా ఫోకస్ చేస్తూ అధికార పార్టీని చీల్చి చెండాడారో అంతగా ఆరూరి రమేష్ క్యాంప్ కార్యాలయం గురించి కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యేలా చేసారు. ఎం ఎల్ ఏ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడమే కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీపై కూడా విమర్శలు వెల్లువలా వచ్చిపడ్డాయి దాంతో ఐటీ , మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటించి నాళాలపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాడు.

ఇదే క్రమంలో ఎం ఎల్ ఏ ఆరూరి రమేష్ తన కార్యాలయంని కూల్చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. క్యాంప్ కార్యాలయం కొంత భాగం కూల్చివేశారు అధికారులు ఇప్పుడు ఈ విషయం మరింత వైరల్ అయ్యే అవకాశం ఉంది. అధికార పార్టీ ఎం ఎల్ ఏ కాబట్టి యథేచ్ఛగా ఉంటుంది అని అనుకున్న వాళ్లకు ఎం ఎల్ ఏ షాక్ ఇచ్చాడు తన కార్యాలయంని కూల్చేసి. 

మునుపటి వ్యాసంపరకాల మారణహోమానికి 73 ఏళ్ళు
తదుపరి ఆర్టికల్ఆ కష్టాలు పడలేక నెంబర్ మార్చిన సమంత
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి