బాలుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

0
30
sp balu

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలని అందుకు తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ , హిందీ భాషల దర్శక నిర్మాతలు , హీరోలు అందరూ కృషి చేయాలనీ అంటున్నాడు హీరో అర్జున్. తీవ్ర అనారోగ్యంతో మరణించిన బాలు అంత్యక్రియలు చెన్నై లోని ఫామ్ హౌజ్ లో నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బాలు పార్దీవ దేహాన్ని దర్శించుకున్న హీరో అర్జున్ బాలు అంత్యక్రియలు అయ్యాక భారతరత్న ఇవ్వాల్సిందేనని అందుకు అన్ని భాషల వాళ్ళు కలిసి కట్టుగా ఈ విషయంలో లాబీయింగ్ చేయాలనీ కోరాడు.


బాలుకు 100 రూపాయలు బాకీ పడిన మోహన్ బాబు : విలక్షణ నటుడు మోహన్ బాబు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు 100 రూపాయలు బాకీ పడ్డారు. అది ఇప్పటి సంఘటన కాదు సుమా ! 1970 నాటి సంఘటన. అప్పట్లో బాలు మంచి స్వింగ్ లో ఉన్నాడు మోహన్ బాబు మాత్రం ఇంకా సరైన బ్రేక్ దొరకక ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న రోజులు దాంతో ఒకరోజు బాలు దగ్గర ఉన్న చనువు కొద్దీ 100 రూపాయలు అప్పుగా తీసుకున్నాడట. అయితే ఆ వంద రూపాయలను ఇప్పటికి కూడా ఇవ్వలేదు మోహన్ బాబు దాంతో నేను ఇచ్చిన వంద ఇప్పటి డబ్బుతో పోల్చితే ఎంత అవుతుందో తెలుసా ……. అంటూ ఆటపట్టించేవాడట. ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పుకుంటూ బాధపడుతున్నాడు మోహన్ బాబు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పలువురు హీరోలకు మంచి అనుబంధం ఉంది అయితే అదే సమయంలో కొంతమందితో చిన్న పాటి గొడవలు కూడా అయ్యాయి . ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ తో బాలుకు ఓ విషయంలో మాటామాటా పెరిగి గొడవ అయ్యింది దాంతో రెండేళ్ల పాటు కృష్ణ కు పాటలు పడలేదు బాలు. అయితే రెండేళ్ల తర్వాత కృష్ణ – బాలు మధ్య సయోధ్య కుదిరింది దాంతో మళ్ళీ కృష్ణ నటించిన చిత్రాలకు పాటలు పాడాడు బాలు. ఇలాంటి ఎన్నో వేల సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు పలువురు సినీ ప్రముఖులు. 

మునుపటి వ్యాసంఅనుష్క నిశ్శబ్దం పై నెగెటివ్ ప్రచారం
తదుపరి ఆర్టికల్రకుల్ ఫోన్ ని సీజ్ చేసిన ఎన్సీబీ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి