దీపికా పదుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

0
55
TMN logo
TMN logo

deepika-

ప్రభాస్ హీరోగా నటించనున్న 21 వ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ దీపికా పదుకునే ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో నటించడానికి దీపికా పదుకునే ఎంత రెమ్యునరేషన్ ఇస్తోందో తెలుసా….. 30 కోట్లు. అక్షరాలు 30 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోంది దీపికా పదుకునే. ఈ భారీ మొత్తాన్ని ఇస్తేనే సినిమా అంగీకరిస్తానని డిమాండ్ చేయడంతో దీపికా ఉండటం వల్ల సినిమాకు మరింత ప్రయోజనం చేకూరుతుంది కాబట్టీ ఇంతటి మొత్తాన్ని ఇవ్వడానికి అంగీకరించారట.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. మహానటి చిత్రంతో వైజయంతి మూవీస్ కి మళ్లీ మంచి రోజులు వచ్చాయి దాంతో 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ రేంజ్ బాహుబలి తర్వాత పెరిగింది దాంతో ఈ సాహసానికి పూనుకుంటున్నారు. ప్రభాస్ – దీపికా పదుకునే జంట కనుల విందుగా ఉంటుందని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. 2021 లో షూటింగ్ స్టార్ట్ చేసి 2022 లో సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి