ప్రభాస్ సినిమాలో నటించడం లేదని తేల్చిన భామ

0
38
prabhas adhipursh

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్న ఆది పురుష్ చిత్రంలో నేను సీతగా నటించడం లేదని డార్లింగ్ అభిమానులకు షాక్ ఇచ్చింది సాలిడ్ అందాల భామ అనుష్క. ప్రభాస్ – అనుష్క లది సాలిడ్ హిట్ కాంబినేషన్ దాంతో ప్రభాస్ కొత్త సినిమా చేస్తున్నాడంటే చాలు అనుష్క హీరోయిన్ గా నటించడం ఖాయమని రకరకాల ఊహాగానాలు వెలువడుతుంటాయి. తాజాగా ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే చిత్రాన్ని ప్రకటించారు. ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు కాబట్టి సీత పాత్రలో అనుష్క అయితే బాగుంటుంది అని డార్లింగ్ అభిమానులు ఫీల్ అయ్యారు. దానికి తగ్గట్లే అనుష్క సీత గా నటించనున్నట్లు పుకార్లు కూడా షికారు చేసాయి.
అయితే అవన్నీ పుకార్లు మాత్రమే అని తేల్చిపడేసింది అనుష్క. సీత పాత్రలో నేను నటించడం లేదు …… అసలు నన్ను ఎవరూ ఆపాత్రకు సంప్రదించలేదు అంటూ కుండబద్దలు కొట్టింది దాంతో ప్రభాస్ ఆది పురుష్ చిత్రంలో అనుష్క లేదనే విషయం కన్ఫర్మ్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా అనుష్క వెల్లడించడం విశేషం.

అనుష్క నటించిన నిశ్శబ్దం చిత్రం అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 2 న స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ లు ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు కాబట్టి అమెజాన్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాపై అనుష్క భారీ ఆశలే పెట్టుకుంది ఎందుకంటే చెవిటి , మూగ యువతిగా నటించి ప్రయోగం చేసింది. తన కష్టానికి ప్రతిఫలం లభిస్తుందా ? లేదా ? అన్న టెన్షన్ అయితే ఉంది అనుష్కలో. ఇక ఈ సినిమా ప్రమోషన్ కు బయటకు రావడానికి భయపడుతోంది అనుష్క ఎందుకంటే కరోనా విలయతాండవం చేస్తోంది కాబట్టి. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో విశ్వప్రసాద్ – కోన వెంకట్ సంయుక్తంగా నిశబ్దం  చిత్రాన్ని నిర్మించారు. 

మునుపటి వ్యాసంముమైత్ ఖాన్ మోసం చేసిందంటున్న క్యాబ్ డ్రైవర్
తదుపరి ఆర్టికల్ఆ హీరోయిన్ ల ఫోన్ లలో నీలి చిత్రాలు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి