డార్లింగ్ ప్రభాస్ తన అభిమానులకు గిఫ్ట్

0
42
prabhas new mostionposter releasing

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్డార్లింగ్ ప్రభాస్ తన అభిమానులకు గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. అభిమానులకు బహుమతి ఏంటి ? ఎందుకు ? అని అనుకుంటున్నారా ? అక్టోబర్ 23 న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు దాంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రాధే శ్యామ్ చిత్రం నుండి మోషన్ పోస్టర్ తో పాటుగా టీజర్ ని విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం దాన్ని కట్ చేసే పనిలో తీవ్రంగా ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే ఓ వెర్షన్ కట్ చేశారట కూడా. అయితే ది బెస్ట్ అనేలా ఉండాలని అందుకే మళ్ళీ మళ్ళీ బెటర్ మెంట్ కోసం చూస్తున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ పుట్టినరోజుకి ఇంకా నెల రోజుల పైనే సమయం ఉంది దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ ని అలరించేలా టీజర్ ప్లాన్ చేస్తున్నారట. తాజాగా ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. యువి క్రియేషన్స్ – గోపికృష్ణా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

పీరియాడికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అభిమానులను అలరించే యాక్షన్ పార్ట్ కూడా అదరహో అనిపించేలా ఉంటుందట. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇక త్వరలోనే మిగతా షూటింగ్ పూర్తి చేయనున్నారు. 2021 వేసవిలో రాధే శ్యామ్ చిత్రాన్ని విడుదల చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ లుక్ ఈ చిత్రంలో చాలా స్టైలిష్ గా డిఫరెంట్ గా ఉంటుందట. డార్లింగ్ పుట్టినరోజు కు టీజర్ రావడం ఖాయమైపోయింది కాబట్టి అభిమానులకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి