పూరి జగన్నాథ్ పై నిప్పులు కక్కుతున్న దళిత సంఘాలు

0
65
puri jagan directore

పూరి జగన్నాథ్ పై నిప్పులు కక్కుతున్న దళిత సంఘాలు

దర్శకుడు పూరి జగన్నాథ్ పై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే పేదలకు , దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇంతకీ పూరి జగన్నాథ్ పై దళిత సంఘాలు ఇంతగా నిప్పులు చెరగడానికి కారణం ఏంటో తెలుసా…….. పూరి జగన్నాథ్ పేద ప్రజలపై అలాగే దళితులపై సంచలన వ్యాఖ్యలు చేయడమే. ఈ ప్రపంచంలో పేదవాడిగా పుట్టడం తప్పు కాదు కాని పేదవాడిగా మరణించడం మాత్రం ముమ్మాటికీ ఆయా ప్రజలదే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పూరి జగన్నాథ్. కులాల వారీగా , పేద ప్రజలని రిజర్వేషన్లు కల్పించడం తప్పని , రిజర్వేషన్లు తొలగిస్తేనే ఇండియా బాగుపడుతుందని అంటున్నాడు పూరి.

ఓటు హక్కు అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఓటు హక్కు కావాలంటే రేషన్ కార్డ్ తొలగించాలని …… ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ లతో తిని తొంగొంటున్నారని వాళ్లకు ఓటు హక్కు ఇవ్వకూడదని , ఇలాంటి వాళ్లకు ఓటు హక్కు ఇవ్వడం వల్ల సరైన నాయకుడిని ఎన్నుకోలేకపోతున్నారని అందుకే రిజర్వేషన్లు తొలగించాలని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు పూరి.

కులాల వారీగా రిజర్వేషన్లు కాకుండా పేద ప్రజలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు పూరి జగన్నాథ్. అసలు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ ఇదే విధంగా ఉంటాయి. రౌడీ మార్క్ తో వ్యవహరిస్తుంటాడు హీరో. నేను బాగుంటే చాలు పక్కోడి సంగతి నాకు ఎందుకు అన్నట్లుగా హీరో క్యారెక్టర్ ని డిజైన్ చేస్తాడు పూరి. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా పూరి ధోరణి మాత్రం మారడం లేదు. నిజ జీవితంలో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటంతో వివిధ కుల సంఘాల ప్రతినిధులు పూరి జగన్నాథ్ పై నిప్పులు కక్కుతున్నారు. ఈ వివాదం మరింత పెద్దది అయ్యేలాగే కనబడుతోం

మునుపటి వ్యాసంఆ చిత్రంపై ఆశలు పెట్టుకున్న మాళవిక శర్మ
తదుపరి ఆర్టికల్వర్మ బయోపిక్ లో శృంగార సన్నివేశాలు కూడా ఉంటాయట
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి