క్రేజీ కాంబినేషన్ సెట్ కాబోతోంది

0
60
balakrishna
టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ సెట్ కాబోతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా పటాస్ , సుప్రీమ్, రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్ రాజు ఓ సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దిల్ రాజు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల అందరితో సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. ఇప్పటికే టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ అయిన నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , ప్రభాస్ , అల్లు అర్జున్ , రాంచరణ్ ,నాని తదితరులతో సినిమాలు చేశాడు కానీ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ లతో మాత్రం సినిమాలు నిర్మించలేదు.

దాంతో ఆ లోటు కూడా భర్తీ చేయాలని అందుకోసం మంచి కథలతో పాటుగా భారీ బడ్జెట్ కూడా పెట్టాలని డిసైడ్ అయ్యాడట దిల్ రాజు. చిరంజీవి తో చర్చలు జరుపుతున్నారు అలాగే అదే సమయంలో బాలయ్య తో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇక బాలయ్య తో సినిమా చేయాలని అనిల్ రావిపూడి నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. కథ పక్కాగా కుదరకపోవడంతో బాలయ్య అంగీకరించలేదు. కానీ ఇప్పుడు కరోనా వల్ల అనిల్ కు కావాల్సినంత సమయం దొరికింది దాంతో బాలయ్య కోసం మంచి కథ రాసుకున్నాడట. ఇక బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాడట. అంటే బాలయ్య పచ్చ జెండా ఊపాలన్న మాట.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి