మలైకా అరోరాకు కూడా కరోనా

0
38
malaika arora got carona

టాలీవుడ్ మూవీ న్యూస్, ముంబై –హాట్ భామ మలైకా అరోరా కు కూడా కరోనా సోకింది ఈ విషయాన్ని ఆమె సోదరి వెల్లడించడం విశేషం. బాలీవుడ్ కుర్ర హీరో అర్జున్ కపూర్ తో మలైకా అరోరా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో మొదట అర్జున్ కపూర్ కు కరోనా సోకింది. అర్జున్ కపూర్ కు కరోనా సోకడంతో మలైకా అరోరా కూడా కరోనా టెస్ట్ చేయించుకోగా ఆమెకు కూడా పాజిటివ్ గా తేలింది. ఈ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు కాబట్టి ఒకరి నుండి మరొకరికి సోకిందని తెలుస్తోంది. గత రెండేళ్లుగా పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు అర్జున్ కపూర్ – మలైకా అరోరా.

మలైకా అరోరా ఐటెం గర్ల్ గా బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించింది. 46 ఏళ్ల వయసులో తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది. భర్త అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చి సంచలనం సృష్టించిన మలైకా తనకంటే చిన్నవాడైన అర్జున్ తో ప్రేమాయణాన్ని సాగిస్తూ మరింత సంచలనం సృష్టిస్తోంది.

ఒంటి మీదకు 46 ఏళ్ళు వచ్చినప్పటికీ తన ఫిట్ నెస్ తగ్గకుండా ప్రతీ రోజు వ్యాయామం చేస్తూనే ఉంటోంది మలైకా. అందుకే బిగి సడలని అందాలతో కుర్ర హీరోని పడేసింది. సమాజం ఏమనుకున్నా ఫరవాలేదు మా సుఖం మాకు కావాలి అంతా మాఇష్టం అంటూ వ్యవహరిస్తున్నారు అర్జున్ కపూర్ – మలైకా అరోరా జంట. అయితే వీళ్ళు పెళ్లి చేసుకోవడం లేదు కానీ ఇలాగె బాగుందని అంటున్నారు. పెళ్లి అయితే ఒకరిపై ఒకరికి అధికారం వస్తుంది కాబట్టి సహజీవనంలో స్వర్గం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరికీ కరోనా సోకడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి