తెలంగాణలో మరో ఎం ఎల్ ఏ కు కరోనా

0
70

తెలంగాణలో మరో ఎం ఎల్ ఏ కు కరోనా సోకింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేల్చారు డాక్టర్లు. మూడు , నాలుగు రోజులుగా అస్వస్థతకు గురయ్యారు జీవన్ రెడ్డి దాంతో కరోనా టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దాంతో హోం క్వారంటైన్ లోకి వెళ్ళాడు ఎం ఎల్ ఏ. జీవన్ రెడ్డి కి కరోనా అని తేలడంతో అతడి కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్ట్ చేశారు. అయితే ఇంకా కుటుంబ సభ్యుల ఫలితాలు రాలేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు.

తెలంగాణ లో ఇప్పటి వరకు పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు.ఇక మంత్రులు , ఎం ఎల్ ఏ లు కూడా పెద్ద సంఖ్యలోనే కరోనా తో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి కొంతమంది కోలుకోగా మరికొందరు హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. జీవన్ రెడ్డి 2014 లో మొదటిసారి తెలంగాణ రాష్ట్ర సమితి తరపున నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుండి ఎన్నికయ్యారు. తిరిగి 2018 లో మరోసారి అదే స్థానం నుండి గెలిచారు. కేసీఆర్, కేటీఆర్ లకు నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నాడు జీవన్ రెడ్డి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి