కమల్ హాసన్ కు కరోనా టెస్ట్ ?

0
27
Corona Test for Kamal Haasan

జాతీయ ఉత్తమ నటుడు కమల్ హాసన్ అనారోగ్య బారిన పడినట్లు తెలుస్తోంది. ఇటీవలే విదేశాలకు వెళ్లొచ్చిన కమల్ హాసన్ స్వీయ రక్షణలో ఉన్నాడు. గృహ నిర్బంధంలో ఉన్న కమల్ హాసన్ 14 రోజుల పాటు బయటకు రాకుండా ఉండనున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తున్న తరుణంలో కరోనా పరీక్షలకు సిద్దమయ్యాడట కమల్ హాసన్. కరోనా లక్షణాలు లేవు కానీ ఫారిన్ వెళ్ళొచ్చాడు కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా టెస్ట్ లకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

కమల్ హాసన్ తమిళనాట మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అలాగే రాజకీయ పార్టీని కూడా స్థాపించిన వ్యక్తి. కరోనా యావత్ ప్రపంచాన్ని భయపెడుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కమల్ హాసన్ తో పాటుగా ఇద్దరు కూతుర్లు అక్షర హాసన్ , శృతి హాసన్ లు కూడా ఫారిన్ వెళ్లొచ్చారు దాంతో వాళ్ళు కూడా వేరే వేరే చోట్ల గృహ నిర్బంధంలో ఉన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి