మహేష్ టీంలో కరోనా కలకలం

0
65
major adivi shashu
సూపర్ స్టార్ మహేష్ బాబు టీంలో కరోనా కలకలం చెలరేగింది. మహేష్ బాబు టీం లో కరోనా కలకలం ఏంటి ? అని అనుకుంటున్నారా ? మహేష్ బాబు తాజాగా అడవి శేష్ హీరోగా మేజర్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ముంబై లో పాకిస్థాన్ మూకలు జరిపిన మూకుమ్మడి దాడి సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆనాటి సంఘటనలో మేజర్ ఉన్ని కృష్ణన్ వీర మరణం పొందారు. దాంతో అతడి బయోపిక్ గా మేజర్ చిత్రం రూపొందుతోంది. మేజర్ ఉన్ని కృష్ణన్ పాత్రలో అడవి శేష్ నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది. ఇటీవలే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తగిన చర్యలు తీసుకుంటూ షూటింగ్ చేసారు. అయితే యూనిట్ లో సగం మంది వరకు కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే అందరికి కోవిడ్ టెస్ట్ లు చేయించారట దాంతో దాదాపు 20 మందికి కరోనా సోకినట్లు తేలడంతో వీళ్ళతో పాటుగా మిగతా వాళ్ళను కూడా ఐసోలేషన్ లో ఉండాలని , తగిన చికిత్స పొందాలని ఆదేశించాడట మహేష్ బాబు.

దాంతో హీరో అడవి శేష్ తో పాటుగా మేజర్ షూటింగ్ లో పాల్గొన్న చిత్ర యూనిట్ అంతా ఐసోలేషన్ లో ఉన్నారట. షూటింగ్ అంటే తప్పకుండా ఓ 50 మంది అయినా ఉండాల్సిందే. ఇంకా సీన్ డిమాండ్ చేస్తే వేలాది మంది కావాలి , కానీ కరోనా విలయతాండవం చేస్తుండటంతో తక్కువమందితో ఉన్న సన్నివేశాలను చిత్రీకరించే క్రమంలో కరోనా సోకింది. కరోనా భయం ఉంది కాబట్టే మహేష్ బాబు ఇప్పట్లో షూటింగ్ లకు వచ్చేది లేదని కుండబద్దలు కొట్టాడట. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రం చేస్తున్నాడు మహేష్ బాబు. 

మునుపటి వ్యాసంఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమా బ్లాక్ బస్టర్
తదుపరి ఆర్టికల్ప్రభాస్ రాముడిగా నటిస్తే మరి రావణుడు ఎవరు ?
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి