కరోనా భయం లేదా ఈ భామకు

0
50

ఒకవైవు కరోనా విలయతాండవం చేస్తుంటే హీరోయిన్ ఆదా శర్మ మాత్రం ఏకంగా కొత్త సినిమా ప్రారంభించడమే కాకుండా షూటింగ్ లో కూడా పాల్గొంటోంది దాంతో షాక్ అవ్వడం మిగతా వాళ్ళ వంతు అవుతోంది. కరోనా మహమ్మారి భయంతో ఎవరు పెద్దగా షూటింగ్ లు చేయడం లేదు కాకపోతే చిన్న చిన్న సినిమా వాళ్ళు మాత్రం తక్కుమందితో షూటింగ్ చేస్తున్నారు. కొన్ని సీరియళ్లు , అలాగే చిన్న సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. నిన్న ఆదా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న కొత్త చిత్రం ప్రారంభమైంది. ఓపెనింగ్ పెట్టి వదిలేయకుండా వెంటనే షూటింగ్ లో పాల్గొంది ఈ భామ.

ఆదా శర్మ కరోనా భయం లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్న తీరుకి షాక్ అవుతున్నారు జనాలు. ఇప్పటికే పలువురు టీవీ నటీనటులు, అలాగే కొంతమంది హీరో, హీరోయిన్ లు కరోనా బారిన పడ్డారు. ఆ విషయం తెలిసి కూడా భయపడకుండా షూటింగ్ చేస్తోందంటే డబ్బు అవసరం అయిన అయ్యుండాలి లేదంటే జాగ్రత్తలు తీసుకుంటే నాకు ఏమౌతుందిలే అన్న ధీమా అయినా అయ్యుండాలి. మొత్తానికి ఆదా శర్మ ధైర్యం కలదే అని నిరూపిస్తోంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి