కరోనా ఎఫెక్ట్ : ఇల్లు శుభ్రం చేస్తున్న అలీ

0
12
Corona Effect Ali cleaning the house

కరోనా ఎఫెక్ట్ తో ఖాళీ సమయం దొరకడంతో ఇంటి పట్టునే ఉంటున్న తారలంతా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు అందులో భాగంగానే నటుడు అలీ కూడా ఇల్లు శుభ్రం చేస్తూ రోజులు నెట్టుకొస్తున్నాడు. నేను బ్యాచ్ లర్ గా ఉన్నప్పుడు వంట చేసేవాడ్ని అలాగే నా బట్టలు నేనే ఉతుక్కునే వాడ్ని. అందుకే ఇప్పుడు ఇంట్లో నా భార్య పని చెబితే పని చేస్తున్నాను ఇందులో తప్పేమి లేదు…… మన పనులు మనం చేసుకోవడం మంచిదేగా అని అంటున్నాడు అలీ.

ఇల్లు ఊడుస్తున్నాను , అలాగే శుభ్రం చేస్తున్నాను అంతేకాదు కూరగాయలు కట్ చేస్తున్నాను అంటూ ఏకరువు పెడుతున్నాడు అలీ. షూటింగ్ ఉన్నప్పుడు నిత్యం ఖాళీ లేక సతమతం అయ్యేవారు ! సెలవు దొరికితే బాగుండు అని ఫీలయ్యే వాళ్ళు నిత్యం బిజీ గా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్లకు ఇపుడు కావలసినంత ఖాళీ సమయం దొరికింది అందుకే ఇలా పనులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి