అల్లు అర్జున్ పుష్ప కథపై కాపీ ఆరోపణలు

0
375
pushpa movie story allegation

అల్లు అర్జున్ పుష్ప కథపై కాపీ ఆరోపణలు

ప్రముఖ రచయిత డాక్టర్ వెంపల్లి గంగాధర్ పుష్ప కథ నాదే అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. నేను తమిళంలో రాసిన కథలను ఆధారం చేసుకొని పుష్ప అనే స్మగ్లింగ్ చిత్రాన్ని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న చిత్రం ఈ పుష్ప. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న పుష్ప చిత్రంపై అప్పుడే కాపీ ఆరోపణలు వస్తున్నాయి.

అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా నటిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తోంది. ఇక బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ ఐటెం సాంగ్ చేయనుంది ఈ చిత్రంలో. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న చిత్రం కాబట్టి శ్రద్దా కపూర్ లాంటి భామ అవసరం అని భావిస్తున్నాడు అల్లు అర్జున్ అందుకే ఏరికోరి మరీ ఈ హాట్ భామని దించుతున్నారు.

ఇక కాపీ ఆరోపణల విషయానికి వస్తే …… ఆచార్య చిత్రంలా పుష్ప చిత్రం ఇంకా రాద్దాంతం కాలేదు. ఈలోపే డాక్టర్ వెంపల్లి తో చర్చలు జరువుతారా ? లేక కాపీ ఆరోపణలతో సంబంధం లేదని వాటిని పట్టించుకోకుండా తమ పని తాము చూసుకుంటారా చూడాలి. ఈ విషయం పై సుకుమార్ స్పందించాలి కానీ సుకుమార్ నుండి ఇంకా ఎలాంటి రియాక్షన్ లేదు. మరోవైపు డాక్టర్ వెంపల్లి మాత్రం పుష్ప కథ నాదే అని ఆరోపిస్తున్నాడు. దట్టమైన అడవుల నేపథ్యంలో రూపొందే సినిమా కాబట్టి మహబూబ్ నగర్ జిల్లా లోని నల్లమల అడవుల్లో చిత్రీకరించాలని భావిస్తున్నారట సుకుమార్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి