సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర

0
38
bollywood star salman

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హత్యకు భారీ కుట్ర జరుగగా ఆ కుట్రని చేధించారు హర్యానా పోలీసులు. కుట్రని చేధించడమే కాకుండా సల్మాన్ హత్యకు కుట్ర పన్నిన వాళ్లలో కొంతమందిని అరెస్ట్ చేసారు కూడా. సంచలనం సృష్టించే ఈ కథనంలో అసలు విషయం ఏంటంటే గతంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడమే. అప్పట్లో కృష్ణ జింకలను వేటాడినట్లుగా సల్మాన్ పై ఆరోపణలు రావడమే కాకుండా కేసు కూడా నడుస్తోంది. సల్మాన్ ఖాన్ తో పాటుగా మరికొంతమంది హీరోయిన్ లు కూడా ఉన్నారు ఈ కేసులో.

అయితే లారెన్స్ బిష్ణోయ్ కుటుంబంతో పాటుగా రాజస్థాన్ లో పలువురు కృష్ణ జింకలను ఆరాధిస్తారు. దైవంగా కొలిచే కృష్ణ జింకలను వేటాడిన సల్మాన్ ఖాన్ కు స్టార్ డం ఉంది కాబట్టి అతడ్ని ఏ న్యాయస్థానం కూడా శిక్షించడం లేదు కాబట్టి ఆ శిక్ష నేనే వేయాలి అని డిసైడ్ అయ్యాడట గ్యాంగ్ స్టర్ అయిన లారెన్స్ బిష్ణోయ్ అందుకే షార్ప్ షూటర్ అయిన రాహుల్ కు సల్మాన్ ఖాన్ ని చంపే బాధ్యత అప్పగించాడు. సల్మాన్ ఖాన్ ని చంపాలని డిసైడ్ అయిన రాహుల్ ముంబై లోని బాంద్రా కు వెళ్లి మూడుసార్లు రెక్కీ కూడా నిర్వహించాడట.

అయితే లక్కీ గా సల్మాన్ ఖాన్ రాహుల్ కంట పడలేదు దాంతో మూడుసార్లు రెక్కీ నిర్వహించినప్పటికీ రాహుల్ కు సల్మాన్ ని చేరుకోవడం కష్టం అయ్యింది. దాంతో ఆ కుట్రకు పాల్పడలేకపోయారు. అయితే హంతకుడు అయిన రాహుల్ ముఠా కోసం మరో హత్యకు సుపారీ తీసుకున్నాడు అని తెలిసి అతడ్ని అరెస్ట్ చేయడానికి వెళ్లి రాహుల్ ముఠాని అరెస్ట్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్ బయటపడింది . ఎవరినో హత్య చేయబోతున్నారు అని అరెస్ట్ చేస్తే సల్మాన్ ఖాన్ కూడా మా లిస్ట్ లో ఉన్నాడు అనే విషయం వెల్లడించారట దాంతో షాక్ అవ్వడం  అయ్యింది. వెంటనే సల్మాన్ ఖాన్ కు ఈ విషయం చేరవేసి మరింత భద్రత కల్పించారట పోలీసులు. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి