కాంగ్రెస్ పార్టీలో అప్పుడే మంత్రి పదవుల కొట్లాట

0
46
telangana congress party

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంకా తెలంగాణలో అధికారంలోకి రాలేదు కానీ అప్పుడే మంత్రి పదవుల కోసం కొట్లాట ప్రారంభమైంది. 2013 లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. అయినప్పటికీ 2014 లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయితే ఎన్నికలకు వెళ్లేముందు ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 20 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు తయారయ్యారు. అంతేనా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 20 మందికి పైగా ముఖ్యమంత్రి అభ్యర్థులు తయారయ్యారు అయితే ఈసారి పట్టుమని 20 మంది కూడా గెలవలేకపోయారు.


ఇక 2023 లో మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ కి ఎన్నికలు జరుగనున్నాయి దాంతో 2023 లో అధికారం మాదే అని అంటోంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు ఫలానా వాళ్లకు మంత్రి పదవులు రానున్నాయి అంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా తమిళనాడుకి చెందిన మాణికం ఠాగూర్ ని నియమించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. మాణికం ఠాగూర్ రాకతో కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. దాంతో రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు.

తాజాగా సంగారెడ్డి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ సర్కారు పై నిప్పులు చెరుగుతూ ఆందోళన చేపట్టారు. కాగా ఆ కార్యక్రమంలో 2023 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సంగారెడ్డి ఎం ఎల్ ఏ తూర్పు జయప్రకాశ్ రెడ్డి మంత్రి అవ్వడం ఖాయమని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఠాగూర్. అయితే అదే వేదికపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గీతారెడ్డి , దామోదర రాజనర్సింహ కూడా ఉన్నారు దాంతో వాళ్లకు కూడా మంత్రి పదవులు వస్తాయని అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాకు మొత్తంగా 5 మంత్రి పదవులు వస్తాయని ప్రకటించారు దాంతో అందరూ ఘొల్లున నవ్వుకున్నారు. ఇంకా అధికారంలోకి రాకముందే అసలు వస్తుందో లేదో తెలియకుండానే మంత్రి పదవులు అంటూ పంపకాలు జరుగుతుండటంతో ఈ కొట్లాట ఇంకా ఎక్కువే అయ్యేలా కనబడుతోంది ఎందుకంటే తెలంగాణ లో ఇంతకుముందు 10 జిల్లాలు ఉండేవి ఇప్పుడు 33 జిల్లాలు అయ్యాయి. ఈలెక్కన ఎన్ని మంత్రి పదవులు కావాలి …… మొత్తంగా 18 మంత్రి పదవులు కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు మరి. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి