ప్రధాని మోడీకి శుభాకాంక్షల వెల్లువ

0
21
pm modi birthday wishes

టాలీవుడ్ మూవీ న్యూస్,ఢిల్లీ -ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు కావడంతో ప్రపంచ వ్యాప్తంగా మోడీకి శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పాటుగా ఇతర దేశాల ప్రధానులు , మంత్రులు అలాగే మన దేశంలో కూడా పలువురు ముఖ్యమంత్రులు , మాజీ ముఖ్యమంత్రులు , కేంద్ర మంత్రులు , మాజీ మంత్రులు , పార్లమెంట్ సభ్యులు , శాసన సభ్యులు ఇతర నాయకులు పోటీ పడి మరీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక ఇదే క్రమంలో పలువురు సినీ నటులు కూడా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసాడు. ప్రధాని నరేంద్ర మోడీకి ఇది 70 వ పుట్టినరోజు దాంతో మరిన్నీ శక్తి సామర్ధ్యాలతో పరిపాలించాలని కోరుతున్నారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ అల్లర్లతో మోడీ ని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించాలని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి అయితే ఎవరు ఎంతగా ఒత్తిడి చేసినా అద్వానీ మాత్రం మోడీని సమర్ధించాడు. తన శిష్యుడిని రక్షించుకున్నాడు. అమెరికా అయితే మోడీ తమ దేశానికి రావడానికి వీల్లేదని చెప్పడమే కాకుండా అతడికి వీసా నిరాకరించారు.

కట్ చేస్తే ఇప్పుడు ఒక్క అమెరికా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా మోడీ కి రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తోంది మా దేశానికి రండి అంటే మా దేశానికి రండి అంటూ. ఒకప్పుడు గుజరాత్ కు భారతదేశానికి మాత్రమే పరిమితమైన మోడీ ప్రాభవం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తం అయ్యింది. అమెరికాలో త్వరలో జరుగనున్న ఎన్నికల కోసం మోడీ జపం చేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఒకప్పుడు మోడీ పేరు ఎత్తాలంటే విసుకున్న వాళ్ళు ఇప్పుడు నమో నమః అంటూ నరేంద్ర మోడీ నామజపం చేస్తున్నారు. 

మునుపటి వ్యాసంసినిమా ప్రకటించిన ఖైదీ దర్శకుడు
తదుపరి ఆర్టికల్పరకాల మారణహోమానికి 73 ఏళ్ళు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి