కెమెరామెన్ రత్నవేలు తల్లి మృతి

0
15
cinematographer rathnavelu mother no more

ప్రముఖ ఛాయాగ్రాహకులు రత్నవేలు తల్లి మృతి చెందింది ఈరోజు. దాంతో రత్నవేలు కుటుంబం శోకసంద్రంలో మునిగింది. దక్షిణ భారతదేశంలోనే టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ గా పేరు గాంచిన రత్నవేలు తల్లి జ్ఞానేశ్వరి రామన్ అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే ఈరోజు ఆరోగ్యం మరింతగా విషమించడంతో తుదిశ్వాస విడిచింది. తల్లి మరణవార్త తో రత్నవేలు కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. తన తల్లి తనకు స్ఫూర్తిగా నిలిచిందని తల్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు రత్నవేలు.

తెలుగు , తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించాడు రత్నవేలు. ఇక తెలుగులో సరిలేరు నీకెవ్వరు , రంగస్థలం , ఖైదీ నెంబర్ 150 , సైరా నరసింహారెడ్డి , రోబో లాంటి బ్లాక్ బస్టర్ లకు కెమెరామెన్ గా పనిచేసాడు రత్నవేలు. ఎక్కువగా సుకుమార్ చిత్రాలకు పనిచేసాడు రత్నవేలు. తన తల్లి మరణించిందన్న విషయం రత్నవేలు ట్వీట్ చేయడంతో పలువురు సినీ ప్రముఖులు రత్నవేలుకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి