నాగ్ ఎంట్రీ ఇవ్వడంతో టెన్షన్ పడుతున్న చిరు

0
68
chiranjeevi will start the shoot shortly

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్కింగ్ నాగార్జున ఒకవైపు బిగ్ బాస్ 4 సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించడమే కాకుండా మరోవైపు వైల్డ్ డాగ్ అనే సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు దాంతో మెగాస్టార్ చిరంజీవి లో టెన్షన్ మొదలైందట. నాగార్జున తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేసుకుంటూ పోతున్నాడు ఇక మిగిలింది నేనే కదా ! నేను కూడా షూటింగ్ కి రెడీ కావాల్సిందే అని కసిగా ఉన్నాడట మెగాస్టార్ చిరంజీవి. అక్కినేని నాగార్జున – మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. హీరోలుగా ఈ ఇద్దరి మధ్య పోటీ ఉన్నప్పటికీ అంతకంటే మించిన స్నేహం ఉంది చిరు – నాగ్ ల మధ్య దాంతో తన మిత్రుడు షూటింగ్ లకు వెళ్తుంటే నేను ఇంకా వెయిటింగ్ లో ఉండటం ఏంటి నేను కూడా రెడీ.

ఆచార్యకు సంబందించిన వర్క్ మొదలు పెట్టేలా షూటింగ్ ప్లాన్ చేయండి అని దర్శక నిర్మాతలకు గట్టిగా చెప్పాడట చిరంజీవి. అయితే ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సరైన ప్లానింగ్ తో రండి అని హెచ్చరికలు జారీ చేసాడట చిరు. షూటింగ్ కి చిరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం షెడ్యూల్ వేసే పనిలో పడ్డాడట. చిరంజీవిని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నాడట కొరటాల.

ఇక ఈ ఆచార్య చిత్రానికి నిరంజన్ రెడ్డి తో కలిసి చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నాడు. మణిశర్మ – చిరు కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి దానికి తోడు రీ రికార్డింగ్ లో రారాజు మణిశర్మ. అందుకే ఈ చిత్రానికి మణిశర్మని ఎంచుకున్నారు. కరోనా వల్ల 5 నెలలుగా షూటింగ్ లన్నీ ఆగిపోయాయి అయితే ఇటీవల కొన్ని చిత్రాల షూటింగ్ లు మొదలు అయ్యాయి. అయితే పెద్ద హీరోలలో నాగార్జున మాత్రమే ధైర్యం చేసి ముందడుగు వేసాడు. దాంతో చిరు కూడా రెడీ అవుతున్నాడు. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి