చిరు – వినాయక్ ల సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా

0
36
chiru vinayak movie

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్- మెగాస్టార్ చిరంజీవి – వివివినాయక్ ల కాంబినేషన్ లో ఇప్పటి వరకు రెండు చిత్రాలు రాగా ఆ రెండు కూడా బ్లాక్ బస్టర్ లు అయ్యాయి దాంతో ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా ప్లాన్ చేస్తున్నారు ఈ కాంబినేషన్ లో. ఠాగూర్ , ఖైదీ నెంబర్ 150 చిత్రాలు చిరంజీవి – వినాయక్ ల కాంబినేషన్ లో వచ్చాయి. ఈ రెండు కూడా పెద్ద హిట్ అయ్యాయి దాంతో మళ్ళీ వినాయక్ ని పిలిచి మలయాళ చిత్రం లూసిఫర్ ని రీమేక్ చేద్దామని చెప్పారట మెగాస్టార్ దాంతో అన్నయ్యతో మళ్ళీ సినిమా చేసే అవకాశం రావడంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడట వినాయక్.

మలయాళంలో సంచలన విజయం సాధించిన లూసిఫర్ చిత్ర రీమేక్ హక్కులు కొన్నాడు చరణ్. తండ్రి చిరంజీవికి ఈ సినిమా బాగుంటుందని కొన్నాడు చరణ్. అయితే మొదట ఈ సినిమాకు దర్శకుడిగా సాహో దర్శకుడు సుజీత్ ని అనుకున్నాడు చరణ్. చిరు కూడా ఒకే చెప్పాడు. స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. అయితే ఎక్కడో తేడా కొట్టడంతో భారీ ప్రాజెక్ట్ కదా ! అందునా మెగాస్టార్ ని హ్యాండిల్ చేయాలంటే మాటలు కాదు అందుకే సుజీత్ ని తప్పించి వినాయక్ కు ఆ బాధ్యతలు అప్పగించారు.

వినాయక్ ఎంటర్ అయ్యాక లూసిఫర్ ని తెలుగుకు అనుగుణంగా మంచి మార్పులు చేసాడట అది మెగాస్టార్ కు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ఈ సినిమా జనవరిలో ప్రారంభం కానుంది. ఆచార్య చిత్రం ఇంకా సగం ఉంది కాబట్టి దాన్ని కంప్లీట్ చేసి జనవరిలో అంటే కొత్త ఏడాదిలో కొత్త సినిమాని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి – వినాయక్ ల కాంబినేషన్ లో సినిమా అంటే మెగాస్టార్ అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని కూడా చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తుండటం విశేషం. ఆలాగే మరో పార్ట్ నర్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి