ఆ ఇద్దరిలో ఒక డైరెక్టర్ ని ఫైనల్ చేయనున్న చిరంజీవి

0
53
megha star

మలయాళంలో విజయం సాధించిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించనున్న ఈ చిత్రానికి నిన్న మొన్నటి వరకు సుజీత్ దర్శకుడు అని అనుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు కాడని వివివినాయక్ అని వినబడుతోంది. ఇంతకుముందు చిరంజీవి – వినాయక్ కాంబినేషన్లో ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. అలాగే ఖైదీ నెంబర్ 150 చిత్రం కూడా వచ్చింది. చిరు రీ ఎంట్రీలో మరోసారి అదరగొట్టాడు ఈ చిత్రంతోనే. దాంతో వినాయక్ అంటే చిరుకి చాలా ఇష్టం. అందుకే మళ్లీ వినాయక్ దర్శకత్వంలో నటించాలనే ఆసక్తితో ఉన్నాడట చిరు.

అందుకే సుజీత్ స్థానంలో వినాయక్ ని తీసుకోవాలని భావిస్తున్నారట చిరు. అయితే సుజీత్ స్క్రిప్ట్ వర్క్ అంతా దగ్గరుండి మరీ చూసుకున్నాడు. దాంతో ఈ సమయంలో సుజీత్ ని కాదంటే సుజీత్ బాధపడే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే సుజీత్ ని ఈ రీమేక్ నుండి తప్పించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్ సర్కిల్లో. అయితే ఇందులో నిజం ఉందా ? లేదా ? అసలు నిజం ఏంటి ? అన్నది మాత్రం ఈనెల 22 లోపు తేలనుంది. ఎందుకంటే ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు కాబట్టి ఆ సందర్భంగా ఈ రీమేక్ సినిమా అసలు దర్శకుడు ఎవరు అన్నది చిరు కన్ఫర్మ్ చేయనున్నాడు. అధికారికంగా ప్రకటించనున్నారు. దాంతో ఈ సస్పెన్స్ కి తెరపడనుంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి