చిరంజీవి ఒప్పుకుంటాడా ?

0
38
chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పరంగా ఇంతటి ఉన్నత స్థితిలో ఉండటానికి తెరవెనుక అల్లు రామలింగయ్య అలాగే అల్లు అరవింద్ కారకులు. అందుకే అల్లు అరవింద్ అంటే చిరంజీవి కి ఎనలేని గౌరవ భావం. పైగా చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్  చిత్రాలకు అల్లు అరవింద్ నిర్మాత కావడం విశేషం. అయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత కాస్త మనస్పర్థలు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తాయి ఫిలింనగర్ సర్కిల్లో. కట్ చేస్తే చిరంజీవి రీ ఎంట్రీలో అల్లు అరవింద్ కు ఇంతవరకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పటికే రెండు సినిమాలు చేసాడు ఇప్పుడేమో మూడోది అలాగే నాలుగో సినిమా కూడా లైన్ లో పెట్టాడు కానీ వీటిలో ఏది కూడా అల్లు అరవింద్ కు చేయలేదు.

అందుకే కాబోలు అల్లు అరవింద్ ఇటీవల ప్రారంభించిన ఓటిటి ” ఆహ ” కోసం చిరంజీవిని నటింప జేసేలా ఒత్తిడి అయితే చేస్తున్నాడట. కథ తీసుకురా నచ్చితే తప్పకుండా చేస్తానని మాట ఇచ్చాడట కూడా. అయితే చిరంజీవికి తగ్గ కథ సెట్ చేసే పనిలో ఉన్నాడు అల్లు అరవింద్. చిరంజీవి గారిని ఆహా కోసం సంప్రదిస్తూనే ఉన్నాం , సరైన కథ దొరికితే తప్పకుండా చేస్తానని అన్నారు అని తెలిపారు అల్లు అరవింద్. అయితే ఓటిటి కోసం చిరంజీవి సినిమా చేస్తాడా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. చిరు అంటే మాస్ హీరో , చిరంజీవి సినిమా థియేటర్ లో విడుదల అయితే ఆ క్రేజ్ వేరు అలాగే సినిమా థియేటర్ వాళ్లతో పాటుగా మరికొంతమందికి ఉపాధి దొరుకుతుంది. ఏమో ! చిరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

మునుపటి వ్యాసంవిషమంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
తదుపరి ఆర్టికల్అప్సరా రాణి అందాలతో థ్రిల్లర్ చిత్రం 11 భాషల్లో
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి