రాజమౌళిని రిక్వెస్ట్ చేసిన చిరంజీవి

0
29
charan,chiru combination in Acharya

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళిని మెగాస్టార్ చిరంజీవి రిక్వెస్ట్ చేసాడట దాంతో మెగాస్టార్ అంతటి వ్యక్తి రిక్వెస్ట్ చేస్తే కాదనగలడా ? తప్పకుండా సార్ మీరు చెప్పినట్లే చేస్తాను అని హామీ ఇచ్చాడట జక్కన్న. ఇంతకీ చిరంజీవి రాజమౌళిని చేసిన రిక్వెస్ట్ ఏంటో తెలుసా ………. ఆర్ ఆర్ ఆర్ చిత్రం కోసం రాంచరణ్ కేటాయించిన బల్క్ డేట్స్ ని మా ఆచార్య సినిమా కోసం వాడుకుంటాం. ఇక్కడ షూటింగ్ లేని సమయాల్లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పెట్టుకోండి ఎందుకంటే నేను – చరణ్ కలిసి నటిస్తే చూడాలని ఉందని నా భార్య సురేఖ కోరింది. ఆమె కోరిక మేరకు తప్పకుండా ఆచార్య చిత్రంలో మేమిద్దరం నటించాల్సిందే అని నిర్ణయించుకున్నామని తెలిపారు చిరు .

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఆచార్య చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ చిత్రంలో కీలక పాత్రలో రాంచరణ్ కూడా నటించనున్నాడు. అయితే ఆర్ ఆర్ ఆర్ చిత్రం పూర్తయ్యేవరకు మరో సినిమా చేయకుండా డేట్స్ అన్ని కూడా ఆర్ ఆర్ ఆర్ కోసమే కేటాయించాడు చరణ్. కట్ చేస్తే ఇప్పుడు ఆచార్య చిత్రంలో కీలక పాత్రకు అంగీకరించాడు కాబట్టి ముందుగా రాజమౌళి అనుమతి తీసుకోవాల్సిందే అని భావించిన చిరంజీవి రాజమౌళికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడట దాంతో అంగీకరించిన రాజమౌళి మీరు షూటింగ్ చేసుకోండి సార్ …….. ఈలోపు ఎన్టీఆర్ పై వచ్చే సన్నివేశాలు చిత్రీకరిస్తాం అంటూ పచ్చజెండా ఊపాడట.

ఇంతకుముందు మగధీర చిత్రంలో చిరంజీవి చిన్న కామియో రోల్ చేసాడు దానికి అద్భుతమైన స్పందన వచ్చింది అలాగే ఖైదీ నెంబర్ 150 చిత్రంలో ఓ పాటలో చిరుతో కలిసి చరణ్ స్టెప్పులు వేసి మెప్పించాడు దానికి కూడా మంచి స్పందన వచ్చింది. అంతేనా చిరు రీ ఎంట్రీ ఇవ్వడానికి ముందుగా చరణ్ హీరోగా నటించిన  బ్రూస్ లీ ద ఫైటర్ అనే చిత్రంలో క్లైమాక్స్ లో వచ్చి ఫైట్ చేసి మెప్పించాడు చిరు. దాంతో మరోసారి నటిస్తే చూడాలని ఉందని చిరు భార్య సురేఖ కోరిందట. ఇక పాత్రలు కూడా బాగా కుదరడంతో తప్పకుండా చేయాల్సిందే అని డిసైడ్ అయ్యారట చిరు, చరణ్ లు. 

మునుపటి వ్యాసంబీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తదుపరి ఆర్టికల్కవిత గెలుపుకు మార్గం సుగమం
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి