పూరి పై సెటైర్ వేసిన చిరంజీవి

0
16
Chiranjeevi satire on puri jagannadh

దర్శకులు పూరి జగన్నాధ్ పై సెటైర్ వేసాడు మెగాస్టార్ చిరంజీవి. పూరి కరోనా ఎఫెక్ట్ తో బ్యాంకాక్ బీచ్ మిస్ అవుతున్నట్లున్నావ్ అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు చిరు. నిన్న ఉగాది పర్వదినం కావడంతో చిరంజీవి సోషల్ మీడియాలోకి అడుగుపెట్టాడు. ఇంతవరకు కూడా చిరంజీవికి సోషల్ మీడియాలో అకౌంట్ లు లేవు కానీ ఉగాది సందర్బంగా ట్విట్టర్ లోకి అలాగే ఇన్ స్టా గ్రామ్ లోకి అడుగుపెట్టాడు మెగాస్టార్.

చాలాకాలం తర్వాత చిరంజీవి సోషల్ మీడియా పట్ల ఆసక్తిగా ఉండటంతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు. అందులో పూరి జగన్నాధ్ కూడా ఒకరు దాంతో బ్యాంకాక్ బీచ్ ని మిస్ అవుతున్నావ్ ! అయినా కరోనా వల్ల నీ ఇద్దరు పిల్లలు నీతో ఎక్కువ సమయం గడిపే ఛాన్స్ లభించింది అంటూ రీ ట్వీట్ చేసాడు చిరంజీవి. పూరి జగన్నాధ్ చిరంజీవికి అభిమాని దాంతో చిరుతో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు కానీ ఆ ఛాన్స్ మాత్రం చిరు ఇవ్వడం లేదు. అయితే 150 వ సినిమా మిస్ కావడంతో ఎలాగైనా సరే చిరంజీవిని డైరెక్ట్ చేస్తానని అంటున్నాడు పూరి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి