వినాయక్ మళ్ళీ మెగా ఫోన్ పట్టనున్నాడు

0
34
Chiranjeevi directing VV Vinayak

దర్శకులు వివివినాయక్ మళ్ళీ మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. హీరోగా మారుదామనిశీనయ్యచిత్రంతో ట్రై చేసాడు పాపం దర్శకుడు. అగ్ర నిర్మాత దిల్ రాజు నరసింహారావు దర్శకత్వంలో శీనయ్య చిత్రాన్ని నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేసాడు కూడా. సినిమా ప్రారంభమైంది అలాగే ఇక సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అని అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ లో ఎక్కడో తేడా కొట్టిందని భావించిన దిల్ రాజు సినిమాని పక్కన పెట్టాడు.

ఇక హీరోగా నటిస్తున్నాను కదా ! అని భావించిన వినాయక్ విగ్గు సెట్ చేసుకోవడమే కాకుండా పొట్ట కాస్త తగ్గడానికి పెద్ద ఎత్తున ఎక్సర్ సైజ్ లు చేసాడు పాపం. కానీ అతడి ఆశలన్నీ అడియాసలు కావడంతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కే మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్ కు దర్శకత్వం వహించేది వినాయక్ అని తెలుస్తోంది. హీరోగా అనుకున్న సినిమా ఎలాగూ పోయింది కాబట్టి మళ్ళీ మెగా ఫోన్ పట్టాలని డిసైడ్ అయ్యాడట వినాయక్

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి