చిరంజీవి చిత్రంలో విలన్ ఎవరో తెలుసా ?

0
22
TMN logo
TMN logo

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం తర్వాత మలయాళంలో విజయం సాధించిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ని విలన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట చరణ్. ఈ చిత్రాన్ని చరణ్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాహో డైరెక్టర్ సుజీత్ ఈ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. చిరంజీవి హీరో అయితే సంజయ్ దత్ విలన్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట సుజీత్.

సంజయ్ దత్ బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరో అన్న విషయం తెలిసిందే. ఒకదశలో నెంబర్ వన్ హీరోగా సంచలనం సృష్టించాడు సంజయ్ దత్. అయితే ఇప్పుడు స్టార్ డం పడిపోయింది దాంతో విలన్ పాత్రలలో సైతం నటిస్తున్నాడు. భారీ దేహం అలాగే భారీ కాయం కాబట్టి తెలుగుతెరకు మరింత నిండుగా ఉంటుందని భావిస్తున్నారట. ఇంకా ఫైనల్ అయితే కాలేదు కానీ చిరంజీవి పాలిట విలన్ సంజయ్ దత్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి సమయం పడుతుంది. ఎందుకంటే ముందుగా ఆచార్య పూర్తి కావాలి. ఆ తర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళేది.

మునుపటి వ్యాసంతెలంగాణలో మరో శాసనసభ్యుడికి కరోనా
తదుపరి ఆర్టికల్మోడీ సర్కారు సంచలన నిర్ణయం: హరీష్ రావుకు పదవి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి