చిరంజీవి చిన్నల్లుడికి కరోనా

0
23

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు హీరో కళ్యాణ్ దేవ్ కరోనా అనుమానంతో కొన్నాళ్ళు హోం క్వారంటైన్ లో ఉన్నాడు. క్వారంటైన్ సమయం ముగియడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అయితే టెస్ట్ లో నెగెటివ్ అని రిపోర్ట్ రావడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. దాంతో రెండు వారాలుగా తన భార్యాపిల్లలకు దూరంగా ఉన్న కళ్యాణ్ దేవ్ ఎట్టకేలకు తన కుటుంబంతో కలిసిపోయాడు. చాలా రోజుల పాటు కుటుంబానికి దూరంగా ఉండటంతో ఒక్కసారిగా ఆ ఇంట ఉద్విగ్న వాతావరణం నెలకొంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ని కళ్యాణ్ దేవ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

కళ్యాణ్ దేవ్ విజేత చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో కొంత కాలం వెయిట్ చేసి ఇప్పుడు సూపర్ మచ్చి అనే చిత్రం చేస్తున్నాడు. పులి వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉండటంతో దాన్ని కరోనా సడలింపులు ఇవ్వగానే కంప్లీట్ చేసాడు. అయితే కరోనా మహమ్మారి ఎక్కడ సోకిందో తెలియదు కాబట్టి రెండు వారాలకు పైగా హోం క్వారంటైన్ లో ఉన్నాడు. కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. నెగెటివ్ అని తేలడంతో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

మునుపటి వ్యాసంవేశ్యగా నటించడానికి సిద్ధమౌతున్న భామ
తదుపరి ఆర్టికల్ప్రభాస్ ద్విపాత్రాభినయం పోషించనున్నాడా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి