చిరంజీవి నక్షలైట్ పాత్ర లుక్ రిలీజ్

0
52
chiranjeevi

 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ ని ఆగస్టు 22 న విడుదల చేయబోతున్నారు. అయితే అంతకుముందే చిరు రోల్ ఎలా ఉండబోతోందో చెప్పడానికి పిడికిలి బిగించి ఎర్ర జెండా పైకి ఎత్తిన స్టిల్ ని నిన్న విడుదల చేసారు ఆ చిత్ర బృందం. ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ ని ఖరారు చేసారు, అయితే ఇంతవరకు అధికారికంగా మాత్రం ప్రకటించలేదు బహుశా ఆగస్టు 22 న చిరంజీవి పుట్టినరోజు కాబట్టి ఆ సందర్బంగా టైటిల్ తో పాటుగా మెగా స్టార్ లుక్ ని కూడా విడుదల చేయవచ్చు.

ఆగస్టు 22 న ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నాం అంటూ ముందుగా ఓ లుక్ రిలీజ్ చేసారు. ఆ లుక్ మెగా అభిమానులను విశేషంగా అలరిస్తోంది. చిరంజీవి ఇందులో నక్సలైట్ నాయకుడిగా అలాగే ప్రొఫేసర్ గా నటిస్తున్నాడు. సామాజిక సందేశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి తో పాటుగా రాంచరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ముందుగా త్రిష ని అనుకున్నారు కానీ ఎక్కడో తేడా కొట్టింది దాంతో త్రిష స్థానంలో కాజల్ వచ్చి చేరింది.

కొరటాల శివ దర్శకత్వంలో ఇంతకుముందు వచ్చిన నాలుగు చిత్రాలు మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను కూడా బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి ఈసారి కొరటాలతో కలిసాడు కాబట్టి అప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం 40 శాతం మాత్రమే ఈ సినిమా షూటింగ్ అయ్యింది. కరోనా లేకపోతే ఈపాటికి ఆచార్య సినిమా పూర్తి అయ్యేది కానీ మనం ఒకలా తలిస్తే దైవం ఇంకోలా తలుస్తాడు కాబట్టి అయిదు నెలలుగా షూటింగ్ లన్నీ ఆగిపోయాయి. కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే ఆచార్య మళ్ళీ పట్టాలెక్కనుంది.

మునుపటి వ్యాసంప్రభాస్ 3 సినిమాలు 11 వందల కోట్ల బడ్జెట్
తదుపరి ఆర్టికల్సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి