టైటిల్ ని రివీల్ చేసిన చిరంజీవి

0
45
chiranjeevi announced movie title

మెగాస్టార్ చిరంజీవి తన సినిమా టైటిల్ ని రివీల్ చేసాడు అప్రయత్నంగా. నిన్న హైదరాబాద్ లో జరిగిన పిట్టకథ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు గెస్ట్ గా వచ్చాడు చిరంజీవి. సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు పిట్ట కథ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు దాంతో సినిమాకు హైప్ తీసుకురావడానికి చిరంజీవి ముఖ్య అథితిగా వస్తే బాగుంటుందని భావించి అడగడటంతో కాదనలేకవచ్చాడు. అయితే మాటల సందర్భంలో అనుకోకుండా తన కొత్త సినిమా టైటిల్ఆచార్యఅని చెప్పకనే చెప్పాడు .

కొరటాల శివ దర్శకత్వంలో చరణ్ నిర్మిస్తున్న ఆచార్య చిత్రంలో చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలో చిరంజీవి నక్సలైట్ గా ఆచార్యగా కనిపించనున్నాడు. అయితే ఆచార్య అనే టైటిల్ వినబడుతున్నప్పటికీ అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. కట్ చేస్తే నిన్న అనుకోకుండా నోరు జారాడు చిరు. ఇంకేముంది అభిమానుల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది టైటిల్ కు. అలాగే సినిమాలో మహేష్ బాబు కూడా కీలక పాత్రలో నటించనున్నాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి