చిరంజీవి ఆచార్య కథ పై కాపీ ఆరోపణలు

0
61
megastar chiranjeevi aacharya

చిరంజీవి ఆచార్య కథ పై కాపీ ఆరోపణలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కాగా ఈ చిత్ర కథ నాదే అంటూ మండూరి రాజేష్ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. ప్రముఖ రాజకీయ నాయకులు గొట్టిపాటి రవి ద్వారా నేను మైత్రి మూవీ మేకర్స్ లో చెర్రీ అనే వ్యక్తిని కలిసి ఈ కథ చెప్పానని , అయితే కథ ఇవ్వాలని డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వమని చెప్పారని దాంతో కథ ఇచ్చేది లేదంటూ వచ్చేసాను. కట్ చేస్తే ఇదే కథతో కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య చిత్రం రూపొందుతుండటంతో నేను పలువురిని కలవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసాను కానీ కుదరలేదు. దాంతో ఇలా మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని అంటున్నాడు రాజేష్.

ఇదే కథతో నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా చేయాలని అనుకున్నానని , ఓ తమిళ నిర్మాత అందుకు సిద్ధం అయ్యాడని కానీ ఈలోపే చిరంజీవి హీరోగా నా కథతో సినిమా చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు రాజేష్ మండూరి. నేను డైరెక్టర్ కావాలని ఈ కథ రాసుకున్నాను అంతేకాని కథ మరొకరికి ఇవ్వడానికి కాదని అంటున్నాడు. చెర్రీ  నా కథని కొరటాల శివ కు ఇచ్చి ఉంటారని అలా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లిందని , న్యాయం కోసం పరుచూరి గోపాలకృష్ణ ని కలిశానని కానీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు మండూరి రాజేష్.

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు చిత్ర కథ పై కూడా అప్పట్లో కాపీ ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ కాపీ ఆరోపణలను కొరటాల పట్టించుకోలేదు. శ్రీమంతుడు చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటించిన విషయం తెలిసిందే. కట్ చేస్తే ఇప్పుడు ఆచార్య చిత్రం ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదు కానీ అప్పుడే ఈ సినిమా కథపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ ఆరోపణలపై దర్శకుడు కొరటాల శివ ఎలా స్పందిస్తాడో చూడాలి. అలాగే మెగాస్టార్ చిరంజీవి , రాంచరణ్ లు కూడా ఎలా స్పందిస్తారో చూడాలి.

మునుపటి వ్యాసంతమన్నా ఇంట కరోనా కలకలం
తదుపరి ఆర్టికల్వనిత మూడో భర్తకు గుండెపోటు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి