వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు చంద్రబాబు నాయుడు

0
63
cbn opposition

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 48 గంటల సమయం ఇస్తున్నాను ఏపీ కి మూడు రాజధానులు కాకుండా అమరావతినే రాజధాని గా కొనసాగించాలని లేదంటే అసెంబ్లీ రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెల్దామని రెఫరెండం తీసుకుందామని సవాల్ విసిరారు చంద్రబాబు నాయుడు. 48 గంటల్లో ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరికలు జారీ చేశారు చంద్రబాబు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీ లో 151 సీట్లను గెల్చుకున్నాడు జగన్ . ఇక చంద్రబాబు నాయుడు కు కేవలం 23 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఆ 23 స్థానాల్లో కూడా ఓ పది మంది వరకు పక్కచూపులు చూస్తున్నారు.

ఇప్పటికే కొంతమంది జగన్ పంచన చేరగా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరికొంతమంది జగన్ పంచన చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో రాజీనామాలు చేద్దాం మళ్లీ పోటీ చేద్దామని చంద్రబాబు అంటుండటంతో కొంతమంది శాసన సభ్యులలో అలజడి మొదలైంది. ఆ సంగతి పక్కన పెడితే చంద్రబాబు సవాల్ ని అధికార వై సీపీ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు , శాసన సభ్యులు చంద్రబాబు ని మరింతగా గేలి చేస్తున్నారు. కావాలంటే …… అమరావతి సెంటిమెంట్ ఉందని భావిస్తే మీ పార్టీకి చెందిన 23 మంది శాసన సభ్యులు రాజీనామా చేసి మళ్లీ గెలవండి అని ప్రతి సవాల్ చేస్తున్నారు తప్ప మేము రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.

మునుపటి వ్యాసంవిలన్ పాత్రలో హీరో
తదుపరి ఆర్టికల్సుశాంత్ ని హత్య చేసారంటూ సంచలన వీడియో విడుదల చేసారు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి