సోనూ సూద్ కు హీరోగా అవకాశాలు

0
31
sonu soodh

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్సోనూ సూద్ కు హీరోగా అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ఇన్నాళ్లు తెరమీద విలన్ పాత్రల్లో నటించిన సోనూ సూద్ లాక్ డౌన్ సమయంలో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. వందలాది వలస కార్మికులను తమ స్వగ్రామాలకు తన సొంత ఖర్చులతో బస్సులను వేసి పంపించాడు. అలాగే ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్న పలువురికి ఆర్ధిక సహాయం చేసి రియల్ హీరో అయిపోయాడు దాంతో దేశ వ్యాప్తంగా సోనూ సూద్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. కరోనా వల్ల సోనూ సూద్ లోని హీరో బయటి ప్రపంచానికి తెలిసాడు దాంతో అతడ్ని హీరోగా పెట్టి సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

సోనూ సూద్ ఒక్క హిందీలోనే కాకుండా తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించాడు , నటిస్తున్నాడు. ఇప్పుడు సోనూ కి దేశ వ్యాప్తంగా హీరో ఇమేజ్ ఉంది కాబట్టి హీరోగా పెట్టి పెద్ద ఎత్తున యాక్షన్ సినిమాలు చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా పలువురు సోనూ సూద్ ని హీరోగా ఊహించుకుంటూ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది సోనూ సూద్ ని కలిసారుట కూడా . అయితే ఇంకా సోనూ సూద్ మాత్రం ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

ఎందుకంటే సోనూ సూద్ ని హీరోగా పెట్టి సినిమాలు చేయాలనీ ప్లాన్ చేస్తున్న వాళ్లంతా మాములు దర్శక నిర్మాతలు మాత్రమే . స్టార్ డైరెక్టర్ లు ముందుకు వస్తే మాత్రం తప్పకుండా సోనూ సూద్ ఒప్పుకునే అవకాశం ఉంటుంది. తాజాగా సోనూ సూద్ అల్లుడు అదుర్స్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి హైదరాబాద్ రావడంతో అల్లుడు అదుర్స్ చిత్ర బృందం పెద్ద ఎత్తున స్వాగతం పలికింది సోనూ సూద్ కు దాంతో ఉబ్బి తబ్బిబ్బయిపోయాడు తెరమీద విలన్ తెరబయట హీరో అయిన సోనూ సూద్. 

మునుపటి వ్యాసంమన్నారు చోప్రా లేటెస్ట్ ఫొటోస్
తదుపరి ఆర్టికల్నితిన్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి